యంత్రపరికరాలు

Two Row Rice Paddy Transplanter: వరి టు-రో రైస్ ట్రాన్స్‌ప్లాంటర్

1
Two Row Rice Paddy Transplanter
Two Row Rice Paddy Transplanter

Two Row Rice Paddy Transplanter:

ఈ యంత్రం చేసే పని: వరిలో 20-25 రోజుల వయస్సు, 3-4 ఆకుల దశకు పెరిగిన చాప రకం నర్సీలో పెంచిన వరి మొలకలను రెండు వరుసలలో ఒకేసారి పొలంలో నాటితుంది.

Two Row Rice Paddy Transplanter

Two Row Rice Paddy Transplanter

దీనిలో గల ముఖ్య భాగాలు: ఫ్రేమ్, ఫ్లోట్‌లు(తెలి ఉండడం కోసం ), విత్తనాల ట్రే(విత్తనాలు బద్రపరుచుటకు), ఆపరేటింగ్ హ్యాండిల్, ఫింగర్స్‌టో రో రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ (పికర్స్), ట్రే డ్రైవ్ యూనిట్ మరియు డెప్త్ కంట్రోల్ మెకానిజంలను కలిగి ఉంటుంది. పరికరాలను నడపడానికి, ఒక చాప రకం నర్సరీని నెల రోజుల ముందుగా పెంచుతారు. చాప పరిమాణం 22 సెంటీమీటర్ల వెడల్పుతో, 45 సెంటీమీటర్ల పొడవుతో మరియు 1.5 సెంటీమీటర్ల మందంతో దమ్ము తర్వాత అదనపు నీరు తీసేసిన తరువాత మరుసటి రోజు ఉదయం నుండి ఈ ట్రాన్స్ ప్లాంటార్ ను పొలం లో ఉపయోగించవచ్చు.

Also Read: హైడ్రోపోనిక్‌గా పెరగడానికి అధిక విలువైన కూరగాయలు

మొలకల చాప ఎలాంటి ఇబ్బందీ లేకుండా జారడం కోసం ట్రే మీద కొద్దిగా నీటిని చిలకరించి, మొలకల మ్యాట్‌లను మెషిన్ ట్రేలో వేసుకుని లోడ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ హ్యాండిల్‌ను మొదటగా పైకి లేపాలి. ఆ తరువాత, ట్రేలో ఉంచి పెట్టిన మొలకలను నాటడానికి దానిని మెల్లిగా క్రిందికి నెట్టాలి. రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ ను ఆపరేట్ చేయడం కోసం వెనుకకు లాగాలి. మొలకలు ఉన్న మాట్‌లు అయిపోయినపుడు మళ్లీ కొత్త ట్రే ట్రాన్స్ ప్లాంట్ మెషీన్ లో లోడ్ చేసుకోవచ్చు. పని పూర్తయిన ప్రతి దినం తర్వాత ట్రాన్స్‌ప్లాంటర్‌ను శుభ్రంగా నీటితో కడగాలి.దీని కెపాసిటీ : 61 m2 /గంట.దీనిని కేంద్ర వరి పరిశోధనా సంస్థ తయారు చేసింది.

Two Row Rice Transplanter

Two Row Rice Transplanter

వరి టూ రో ట్రాన్స్‌ప్లాంటర్‌ లాభాలు :ఈ పరికరం సహాయంతో ఒకేసారి, రెండు వరుసలలో వరి నాట్లు వేయవచ్చు.యూనిట్ భూమికి నారు వేసే వారి కార్డియాక్ ఖర్చులో దాదాపు 16% ఆదా అవుతుందని అంచనా. ఇది సాంప్రదాయ పద్ధతి వలె వంగి నాటు వేసే శ్రమను నివారిస్తుంది.కలుపు సాధనాలు వాడిన కలుపు తీయు సమయంలో శ్రమ మరియు ఖర్చు కలిసివస్తాయి.సాంప్రదాయ నాటు కన్నా కార్మికుడి ఉత్పాదకతలో 79% అధికమవుతుంది. ప్రస్తుతానికి దీని వలన అయే ఖర్చు 6000/- రూపాయలు. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్, కటక్, ఒరిస్సా – 753 006,కుమారి. సిద్దేశ్వర్ ఇంజనీరింగ్, బిద్యధర్పూర్, కటక్ లలో ఈ పరికరం లభమ్మవుతుంది.

Also Read: ఆపిల్ సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Leave Your Comments

Watermelon Protection in Summer: వేసవిలో పుచ్చ సస్య రక్షణ

Previous article

Horticulture: మారుమూల ప్రాంత మహిళా రైతులు ఉద్యానపంట ద్వారా లక్షల ఆదాయం

Next article

You may also like