Tractor Fitted Stone Picker: పంట పొలంలో రాళ్ళు ఎక్కువగా ఉంటే పంట దిగుబడి తగ్గుతుంది. రాళ్ళు ఎక్కువగా ఉన్న పొలంలో కలుపు తీయడం కూడా చాలా ఇబ్బంది. పొలంలో రాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉంటే పంటలు పండించడం రైతులకి కూడా ఇబ్బంది. రాళ్ళుని తీయడానికి కూలీలని పెట్టిన కూలీల ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఏ రైతు కూడా కూలీలని పెట్టి రాళ్ళును తీయాలి అనుకోవడం లేదు. కూలీలని పెట్టిన కూడా ఒక ఎకరంలో దాదాపు 10 మంది కూలీలతో రాళ్ళును తీసిన 20-25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కూలీలు రాళ్ళును తీసిన కూడా పొలం పై భాగంలో కనిపించే రాళ్ళును మాత్రమే తీస్తారు. పొలంలోపల ఉండే రాళ్ళును తీయరు.
పొలంలో ఎక్కువ రాళ్ళు ఉంటే ఆ పొలం ఖరీదు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి పొలాలని కొన్నాడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇలా రాళ్ళును తీయలేక చాలా మంది రైతులు పొలాలని బంజరు భూమిగా వదిలేసారు. పొలంలో రాళ్ళు ఎక్కువగా ఉంటే నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలు ఎక్కువగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నాయి. రైతు సమస్యలని చూసిన దీపక్ రెడ్డి పొలంలో రాళ్ళు తీసే యంత్రన్ని తయారు చేశారు.
దీపక్ రెడ్డి గారు మెకానికల్ ఇంజనీరింగ్ 2017 సంవత్సరంలో పూర్తి చేశాడు. 2017 సంవత్సరం నుంచి పొలంలో రాళ్ళు తీసే యంత్రన్ని తయారు చేయడం మొదలు పెడితే 2020 సంవత్సరంలో ఈ యంత్రం తయారీలో విజయం సాధించాడు. ఈ రాళ్ళు తీసే యంత్రన్ని ట్రాక్టర్ ద్వారా ఆపరేట్ చేయాలి. ట్రాక్టర్ మాత్రం కచ్చితంగా 50 హెచ్ పి ఉండాలి.
ఈ పరికరం ముందు భాగంలో బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ పొలంలో 6 ఇంచుల లోపలికి వరకు వెళ్తుంది. బ్లేడ్ 60 ఇంచుల వెడల్పు ఉంటుంది. బ్లేడ్ తర్వాత ఒక రోటర్ ఉంటుంది. రోటర్ చైన్ ద్వారా తిరుగుతుంది. చైన్ తిరగడం వల్ల మట్టి కిందకి పడి, రాళ్ళు వెనకాల ఉన్న డంపర్లో పడుతాయి. ఈ డంపర్ దాదాపు 2 టన్నుల కెపాసిటీ ఉంటుంది. డంపర్లో ఉన్న రాళ్ళు నేరుగా ట్రాక్టర్ ట్రాలీలో వేసుకోవడానికి హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
Also Read: Integrated Parthenium Management: “వయ్యారిభామ” కలుపు నిర్మూలనకు సమగ్ర చర్యలు.!
ఈ యంత్రానికి సింగిల్ హైడ్రాలిక్ లీవర్ వాడటం వల్ల బ్లెడ్స్ ఎక్కువ లోతులోకి వెళ్లకుండ చూస్తుంది. ఈ యంత్రాన్ని వాడడానికి రెండు గంటల ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. ఒక ఎకరంలో రాళ్ళు తీయడని 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. పొలంలో ఎక్కువ రాళ్ళు ఉంటే 4 గంటల సమయం కూడా అవుతుంది. 30 ఎం. ఎం రాళ్ళ నుంచి 12 అంగుళాల రాళ్ళ వరకు ఈ యంత్రం ద్వారా తీయవచ్చు.
ఈ యంత్రానికి ఎలాంటి నిర్వహణ అవసరం ఉండదు, రాళ్ళు ఇరుకుపోయే సమస్య ఉండదు, రాళ్ళు ఇరుకుపోయి యంత్రంలోని పరికరాలు విరిగిపోయే అవకాశం ఉండదు. రాళ్ళు ఇరుకుపోతే సెన్సర్ శబ్దం ద్వారా యంత్రం పనిచేయడం ఆగిపోతుంది. రాళ్ళను తీసి మళ్ళీ యంత్రాన్ని నడుపోకవచు. ఈ యంత్రం ద్వారా పొలంలో రాళ్ళు తీయడానికి ఒక ఎకరానికి 10 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఒక సీజన్లో 70 ఎకరాల వరకు రాళ్ళు తీయవచ్చు. ఈ యంత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే 9493111157, 8500054626 నెంబర్ సంప్రదించండి.
Also Read: Portable Solar Pump: పోర్టబుల్ సోలార్ పంప్ ఎలా వాడాలి..