Agriculture Trolley: రైతులు పండించిన పంటని మార్కెట్కి తీసుకొని వెళ్ళడానికి. లేదా విత్తనాలు, ఎరువులు బస్తాలు, గడ్డి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లాడని ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ బస్తాలు తీసుకొని వెళ్ళడానికి రెండు మూడు ట్రాక్టర్ కూడా వాడుతుంటారు. దానితో ఖర్చు కూడా పెరుగుతుంది. నల్గొండ జిల్లా కొండల్ రైతు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక పరికరం తయారు చేసుకున్నారు.
రెండు ట్రాక్టర్ ట్రాలీలో సరిపోయే అని వస్తువులు లేదా పంట బస్తాలు, గడ్డి ఒకే ట్రాలీతో తీసుకొని వెళ్ళవచ్చు. కొండల్ రైతు ఒక ట్రాలీ సెంకండ్ హాండ్స్లో తీసుకున్నాడు. తన ట్రాక్టర్ ట్రాలీకి ఇంకో ట్రాలీని వెల్డడింగ్ చేసి అతికించారు. సాధారమైన ట్రాలీకి రెండు చక్రాలు ఉంటాయి.
Also Read: Mango Post Harvest Practices: కోతల తర్వాత మామిడి తోటల్లో యాజమాన్యం.!
ఈ ట్రాలీ ఎక్కువ బరువు తీసుకొని వెళ్ళాలి, ఎక్కువ పొడువు ఉండటంతో దీనికి నాలుగు చక్రాలు ఏర్పాటు చేసారు. సాధారమైన ట్రాలీ 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ ఈ పెద్ద ట్రాలీ 14-15 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు ఉంటుంది.
ఈ పెద్ద ట్రాలీ తయారీకి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. దీని ద్వారా రెండింతల పని ఒకటే సారి చేసుకోవచ్చు. రెండు ట్రాకర్ ట్రాలీలతో తీసుకొని వెళ్లే గడ్డి, ఈ ఒక పెద్ద ట్రాలీతో తీసుకొని వెళ్ళవచ్చు. దానితో రైతులకి కొంచం ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ రేడియస్ అఫ్ సర్రకిల్ ఈ ట్రాలీకి ఎక్కువగా ఉంటుంది. దీనిని మూలమలుపులో తీసుకొని వెళ్లే సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Lily Cultivation: ఈ కొత్త పరికరంతో సంపంగి పువ్వుల తోటలో కలుపుని సులువుగా తీయవచ్చు.!