3 in 1 Tractor Sprayer: రైతులు పండించే పంటకి విత్తనాలు వేయడం నుంచి పంటని అమ్ముకునే వరకు ఎన్నో సమస్యలు. విత్తనాలు వేసాక పంటకి ఎలాంటి పురుగులు పట్టకుండా చూసుకోవాలి, మొక్కలు ఎదగడానికి ఎరువులు చల్లాలి. రైతులకి పండుతున్న పంటకి ఎలాంటి చీడ పురుగులు పట్టకుండా చూసుకోవాలు. చిన్న రైతులు వాళ్ళు వేసే పంటకి పురుగుల మందులు, ఎరువులు పిచుకరీ చేయడం చాలా సులువు. ఒక స్ప్రేయర్ పరికరంతో ఒక గంటలో పిచుకరీ చేస్తారు. ఎక్కువ పొలం ఉన్న రైతులు పొలానికి పిచుకరీ చేయడానికి చాలా ఇబ్బందులు అదురుకుంటున్నారు. ఈ సమస్యలకి చెక్ పెట్టడానికి ఒక పరికరం వచ్చింది. ఈ ఒక పరికరంతో మూడు విధాలుగా పంటకి పిచుకరీ చేసుకోవచ్చు. ఈ పరికరాని ట్రాక్టర్ ద్వారా వాడుతున్నాం కాబ్బటి దీనిని 3 ఇన్ 1 ట్రక్టర్ స్ప్రేయర్ అంటారు.
ఈ 3 ఇన్ 1 ట్రక్టర్ స్ప్రేయర్ వాడుకొని రైతులకి ఉన్న పొలం మొత్తం ఒకే సారి పిచుకరీ చేసుకోవచ్చు. ఈ 3 ఇన్ 1 ట్రక్టర్ స్ప్రేయర్లో మొదటిది పంప్ ద్వారా పైప్ ని అటాచ్ చేసుకొని దాదాపు 300 మీటర్ల పొలంలో తిరుగుతూ స్ప్రే చేసుకోవచ్చు. ఈ పరికరానికి ఒక వాటర్ ట్యాంక్ కనెక్ట్ చేసుకొని ఉంటుంది. ఈ ట్యాంక్లో నీళ్లు, పురుగుల మందులు లేదా ఎరువులు తగ్గిన మోతాదులో కలుపుకోవాలి. స్ప్రయింగ్ పంప్ ద్వారా పిచుకరీ చేసుకోవచ్చు.
స్పయిన్గ్ విడ్త్ని రైతుల పొలానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. స్ప్రయింగ్ పూర్తి అయ్యాక పైప్ని మళ్ళి దాని స్థానంలో ఉంచడానికి ఒక పెడిల్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ పెడిల్ కాలితో నొక్కడం ద్వారా పైప్ ఒక రింగ్కి చుట్టుకుంటుంది. పైప్ చుట్టుకునే వేగం మనం పెడిల్ పై ఆధార పడి ఉంటుంది. ఈ స్ప్రయింగ్ మొత్తం ఆటో రోల్ పద్దతి పై పనిచేస్తుంది.
Also Read: Auto Roll Tractor Mounted Sprayer: ఆటో రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఎలా ఉపయోగించాలి.!
ఈ పరికరానికి వైపర్ అటాచ్ చేసుకొని ఉంటాయి. వైపర్ ద్వారా పొడవుగా ఉండే మొక్కలకి పిచుకరీ చేసుకోవచ్చు. ఈ వైపర్ ఆటోమేటిక్ మూవ్మెంట్ ఉండటంతో మొక్క చుట్టూ, సమానంగా పిచుకరీ చేస్తుంది. వైపర్ పొడవు, స్ప్రయింగ్ విడ్త్ కూడా రైతుల పొలాన్ని బట్టి మార్చుకోవచ్చు.
దీనికి ఇంకో పరికరం కూడా కనెక్ట్ చేసుకొని ఉంటుంది అదే బూమ్ స్ప్రేయర్. ఈ బూమ్ స్ప్రేయర్ సహాయంతో ఎక్కువ పొలం స్ప్రే చేసుకోవచ్చు అని మన అందరికి తెలుసు. కానీ ట్రాక్టర్ అట్టచేడ్ బూమ్ స్ప్రేయర్ ఉంటుంది అని తెలియదు. ఈ బూమ్ స్ప్రేయర్ 30 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి 20 నోజ్ల్స్ ఉంటాయి. ఒక నోజ్ల్ అడుగున్నర దూరంలో ఏర్పాటు చేసుకొని ఉంటుంది.
3 ఇన్ 1 ట్రక్టర్ స్ప్రేయర్ ద్వారా రైతులకి మందుల పిచుకరీ సులువుగా మారింది. మార్కెట్లో ఈ మూడు పరికరాలతో కొనుగోలు చేసుకోవాలి అంటే లక్ష రూపాయలకి దొరుకుతుంది. బూమ్ స్ప్రేయర్ లేకుండా ఈ పరికరం కావాలి అంటే 80000 రూపాయలకి దొరుకుతుంది.
Also Read: Sabji Kothi: పండ్లని, కూరగాయాలని స్టోర్ చేసుకోడానికి కొత్త పరికరం.!