Farmer Success Story: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వండర్స్ చేస్తుంది. మనల్ని ఆశ్చర్యపరిచే ప్రతి అప్లికేషన్ ఒక గొప్ప ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే. ఇక వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పాత్ర కీలకంగా మారింది. శ్రమ లేని సాగుకు అడుగులు పడుతున్న ఈ సమయంలో యువరైతు తక్కువ సమయంలో ఎక్కువ విత్తనాలను చల్లే యంత్రాన్ని సృష్టించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
యువరైతు రాజ్ కుమార్ తన యంత్రం గురించి ఇలా చెప్పుకొచ్చాడు. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. నేను 2019లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. మాది రైతు కుటుంబం. నేను చిన్ననాటి నుండి వ్యవసాయ ట్రాక్టర్లను నడిపేవాడిని. పంటల సాగు గురించి నాకు బాగా అవగాహన ఉంది. ప్రస్తుతం రైతులకు కూలీలా కొరత తీవ్రంగా వేధిస్తుంది. అయితే రైతు సమస్యలను చూసి పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో నా ఆలోచనను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాను అని చెప్పాడు. కాగా రాజ్ కుమార్ ఆలోచన మెచ్చిన నేషనల్ ఇంజినీరింగ్ కాలేజీ 2 లక్షల 50 వేలు ఫండింగ్ అందించింది. ఆ డబ్బుతో విత్తనాలు వేసే యంత్రాన్ని అయన తయారు చేశారు.
Also Read: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
మార్కెట్లో ఇలాంటి యంత్రాల ధర రెండు లక్షలకు పైగా ఉంది. కానీ మేము తయారు చేసిన యంత్రం ధర కేవలం రూ. 30,000 మాత్రమే. ట్రాక్టర్ ఉన్న రైతులు ఇనుప గోర్రుపై ఈ యంత్రాన్ని సులభంగా బిగించవచ్చు. చౌకగా లభించే ఈ యంత్రం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని అంటున్నారు రాజ్ కుమార్.
విత్తనాలను లెక్కించేందుకు ఇమ్కలెంటీర్స్ టెక్నాలజీని వాడుతున్నాము. ఇది ఒకే చోట రెండు విత్తనాలు పడకుండా చూస్తుంది. ఈ పరికరం రైతులకు కూడా బాగా నచ్చిందని అంటున్నారని రాజ్ కుమార్ చెప్పారు. గోర్రుపైన బిగించిన ఆ యంత్రం సరైన ప్రదేశంలో సరైన మోతాదులో విత్తనాలను వదులుతుంది. దీనివల్ల రైతులకు చాలా సమయం అదా అవుతుంది. వానాకాలంలో తొలకరి తర్వాత సాధారణంగా విత్తనాలు వేస్తుంటాము. ఈ యంత్రం వల్ల ఒక రోజులో 20 ఎకరాల్లో విత్తనాలు చల్లొచు. అయితే పొలం అదునుగా ఉన్నప్పుడే విత్తనాలు చల్లాలి. విత్తనాలు చల్లే విషయంలో ఆలస్యం చేస్తే దిగుబడి తగ్గుతుంది . కాబట్టి అలాంటి సమస్యల కోసం ఈ యంత్రం పరిష్కారం చూపిస్తుంది అని అంటున్నాడు యువరైతు రాజ్ కుమార్.
Also Read: YONO కృషి యాప్ ద్వారా విత్తనాలు