Seed Treatment Drum: రైతు తన పొలంలో చీడ పీడల యాజమాన్యంలో చేపట్టే ప్రక్రియలలో విత్తన శుద్ధి మొదటి అస్త్రంగా పేర్కొనవచ్చు. వివిధ విత్తన శుద్ధి రసాయనాలతో విత్తనాన్ని కలపడం వలన పంట మొదటి దశలలో మొక్కలను వివిధ చీడ పీడలను అదుపులో పెట్టడానికి సహాయపడ్తుంది. విత్తన శుద్ధి జాగ్రత్తగా చేయాలి. దీని కోసం ఒక వరస క్రమమును పాటించాలి. మొదటిగా తెగులు నాశిని, ఆ తరువాత కీటక నాశింది, దాని తరువాత జీవ సంబంధ కీటక నాశినితో విత్తన శుద్ధి చేయాలి. అయితే శాస్త్రీయ జ్ఞానం లేకుండా చాలా మంది రైతులు విత్తన శుద్ధి చేయడం మానేశారు. దీనిని సులభతరం చేయడానికి సీడ్ ట్రీట్మెంట్ డ్రమ్ అందుబాటులోకి రావడం గమనార్హం.
తక్కువ శ్రమతో ఎక్కువ విత్తనాలు శుద్ధి చేసే రసాయనాలతో ఏకరీతిగా కలపడం కొరకు ఇది సహాయపడుతుంది. సంక్షిప్త వివరణ: విత్తన శుద్ధి డ్రమ్ లో ముఖ్య భాగాలు. ఫ్రేమ్, హ్యాండిల్, స్థూపాకార డ్రమ్. స్థూపాకార ఆకారపు డ్రమ్ ట్రై-పాడ్ యాంగిల్ ఇనుము ఫ్రేమ్‌పై అమర్చబడింది. ఏకరీతిగా కలపడం కోసం మిక్సింగ్‌లో మూడు తేలికపాటి స్టీల్ ఫ్లాట్ ముక్కలు డ్రమ్ లోపల భాగంలో వెల్డింగ్ చేయబడి ఉంటాయి.
Also Read: చెఱకు పంటకోత మెచ్యూరిటీ లక్షణాలు
రసాయనాలను విత్తనంతో కలపడానికి ముందు,రైతులు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్లాస్టిక్ గ్లోవ్స్ మాస్క్ ధరించడం సురక్షితమైనది.విత్తన శుద్ధి కోసం డ్రమ్‌లో రసాయనాలు కలిపి,ఆ డ్రమ్ములో కొద్దిగా నీరు పోసి, డ్రమ్ యొక్క మూతను మూసివేయాలి,ఆ తరువాత డ్రమ్‌ని 20-25 రివల్యూషన్‌ల వేగంతో తిరిగేలా చేయాలి. కలపడం పూర్తి అయిన 1-2 నిమిషాల తర్వాత,డ్రమ్ము యొక్క మూత తెరిచి, శుద్ధి చేసిన విత్తనాన్ని ప్రత్యేక బ్యాగ్ / కంటైనర్‌లో తీసుకోవాలి. 20 కిలోల విత్తనం శుద్ధి కోసం 5-6 నిమిషాల సమయం పడుతుంది.
ఇందులో నింపడం, చికిత్స చేయడం, డ్రమ్ము నుండి ఖాళీ చేయడం ఉంటుంది. పని పూర్తయ్యే వరకు చేతికున్న గ్లోవ్స్, ముకానికి ఉన్న మాస్క్ తీయరాదు. పిల్లలను శుద్ధి చేసే ప్రదేశాల దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. పని పూర్తి అయినా తర్వాత, చేతులు, కాళ్ళు, ముఖం మరియు కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి.ఈ డ్రమ్ము పూర్తి కెపాసిటీ: 200 kg/h. రసాయనాలతో ప్రత్యక్ష సంబంధము లేకుండా చేయడం వలన రైతుకి భద్రతను కల్పించవచ్చు. సునాయాసంగా విత్తన శుద్ధిని చేయవచ్చు. ఆడవారు సైతం శ్రమ లేకుండా త్వరితగతిన, ఎవరి పైన ఆధార పడకుండా ఈ యంత్ర పరికరం ఉపయోగపడుతుంది.దీని విలువ సుమారుగా రూ. 2000/-. దీనిని CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038 వారు వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగతా సమాచారం కోసం CIAE, భోపాల్ వారిని సంప్రదించగలరు.
Also Read: అంజూర్ సాగులో మెళుకువలు