PAU Seed Drill: పంజాబ్ వ్యవసాయ వర్సిటీ సీడ్ డ్రిల్ ఫంక్షన్: గోధుమ, సోయాబీన్, మొక్కజొన్న, పెసర, కంది వంటి పెద్ద సైజ్ గల విత్తనాలను వరుసలలో విత్తడానికి ఉపయోగపడుతుంది.
విత్తన డ్రిల్ సంక్షిప్త వివరణ: PAU సీడ్ డ్రిల్ మహిళా కూలీల కోసం నాటే సమయంలో వంగి విత్తడం వలన ఆరోగ్యానికి వచ్చే దుషపరిణామాలను దూరంగా ఉంచడం కోసం తయారు చేయబడింది. ఇది ఒక హ్యాండిల్, సీడ్ కోసం తొట్టి, గ్రౌండ్ వీల్, ఫ్లూట్ రోలర్ మరియు డ్రిల్ లాగడానికి వీలుగా ఒక హుక్ ను అమర్చి ఉంటుంది. విత్తనం యొక్క మీటరింగ్ అనగా విత్తనం ఎంత దూరంలో ఎంత ఎడంతో పడాలో ఫ్లూట్ రోలర్ నిర్ణయిస్తుంది.
ఇది చైన్ మరియు స్ప్రాకెట్ పద్దతి ద్వారా గ్రౌండ్ వీల్ షాఫ్ట్ ద్వారా నడపబడును. విత్తన డ్రిల్ వాడే ముందు పొలాన్ని బాగా సిద్ధం చేసుకోవాలి. సీడ్ డ్రిల్‌ను ఇద్దరు కూలీలతో పని చేపించవచ్చు. ఇందులో ఒకరు లాగడానికి, ఇంకోకరు నెడుతూ మార్గదర్శకత్వం చేయడానికి ఉండాలి. లాగడం కోసం సీడ్ డ్రిల్ ముందు అమర్చిన కొక్కెంతో తాడు కట్టుటకు వీలుగా ఉంటుంది.ఇది గంటకు 430 m2 విస్తీర్ణంలో విత్తడానికి అవకాశం కల్పిస్తుంది.
Also Read: డపోగ్ పద్ధతిలో వరి నర్సరీ
PAU సీడ్ డ్రిల్ లాభాలు: సాంప్రదాయ పద్ధతి కంటే 18 రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవుట్‌పుట్ యూనిట్‌కు కూలీల శక్తిలో దాదాపు 87% ఆదా చేస్తుంది. సీడ్ డ్రిల్ ఉపయోగించడం ద్వారా, సాంప్రదాయ పద్ధతి వలె వంగడం వలన నడుము నొప్పి రావడం ఉండదు. కలుపు తీయడానికి మెకానికల్ కలుపు తీసే యంత్రాలను వినియోగించడం వలన కలుపు తీయుట సమయంలో ఖర్చుతో పాటుగా శ్రమ తగ్గుతుంది. విత్తన ఆధా జరుగుతుంది. ఈ పరికరానికి అయే ఖర్చు: రూ. 5000/-
PAU సీడ్ డ్రిల్ అభివృద్ధి చేసినది పంజాబ్ వ్యవసాయ యూనివర్సిటీ,. లుధియానా మరియు CIAE, భోపాల్-NRCWA సబ్‌సెంటర్. ఇది ప్రస్తుతం CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038 వారి ఆధ్వర్యంలో అమ్మకానికి అందుబాటులో ఉంచబడినది.
Also Read: రసాయనాలు లేకుండా పచ్చి అరటిపండ్లను పండించండి