Bullet Tractor: వ్యవసాయరంగంలో అత్యాధునిక టెక్నాలజీతో ఎన్నో రకాల యంత్రాలు, పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు వ్యవసాయానికి కాడి ఎద్దులు వాడేవారు. తర్వాత యంత్రాలు అందుబాటులోకి రావడంతో రైతులకు ఖర్చుభారం కూడా బాగా పెరిగిపోయింది. వాటి ఖర్చులు అధికంగా ఉండడంతో చాల మంది రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్లు కొని వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. విత్తనం దగ్గరనుంచి కోత వరకు ఇప్పుడు అందరు యంత్రాలతోనే వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఓ రైతు ఈసమస్యలకు చక్కటి పరిష్కారం కోసం ఒక వినుత ఆవిష్కరణను రూపొందించాడు.
10HP బుల్లెట్ ట్రాక్టర్
నల్గొండ జిల్లా రసూల్ పురా గ్రామానికి చెందిన రైతులు. మెట్ట పంట సాగులో బుల్లెట్ ట్రాక్టర్ ను ఉపయోగించి సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి అనే యువ రైతు ఐదేళ్ల క్రితం గుజరాత్ లో తయారు చేసిన 10HP బుల్లెట్ ట్రాక్టర్ ను కొనుగోలు చేసి పత్తి సాగు చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నర్సింహా యాదవ్, జానయ్య సైతం భూమి దున్నడం దగ్గర నుంచి విత్తనాలు నాటడం, మందు పిచికారి, గడ్డి తొలగించడం వంటి అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా కూలీల కొరతను అధిగమించడంతో పాటు తక్కువ ఖర్చుతో సాగు చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: Israel Olive Tree: ఆ రైతును కోటీశ్వరుడుని చేసిన ఇజ్రాయెల్ చెట్టు.!
బుల్లెట్ బాడీ, ఆటో ఇంజన్, ట్రాక్టర్ పనితనంతో మార్కెట్లోకి విడుదల
తక్కువ ఖర్చుతో పొలం దున్నడం తో పాటు ఎన్నో వ్యవసాయ పనులకు ఉపయోగించే బుల్లెట్ బండి ఇది. ఈ బుల్లెట్ ట్రాక్టర్ లో బుల్లెట్ బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనంతో మార్కెట్లోకి వచ్చింది. రూ.100 ఖర్చుతో ఎకరం దున్నే ఈట్రాక్టర్ తో ఎన్నో వ్యవసాయ పనులకు ఉపయోగిస్తున్నారని రైతులు అంటున్నారు. దీంతో దుక్కి దున్నడం, కలుపు తీయడం, సాళ్లు పెట్టడం లాంటి పనులు చేసుకోవచ్చు. ఈట్రాక్టర్ తయారీకి దాదాపు రూ.60వేల రూపాయలు ఖర్చు అవుతుంది. జాదయ్య యాదవ్ ఈవాహనాన్ని కొనుగోలు చేశాడు. ఈ వాహనం మెట్ట భూములను దున్నడానికి మాత్రమే పనిచేస్తుంది. ఒక లీటరు డీజిల్ తో ఎకరం పొలాన్ని ఒక గంట సమయంలో దున్నుకోవచ్చు. సాధారణంగా పొలాన్ని ఏడుసార్లు దున్నుకోవాల్సి ఉంటుంది. ట్రాక్టర్ తో అయితే గంటకు రూ.1000 చొప్పున మొత్తం రూ.7000 ఖర్చు అవుతుంది. అదే ఈ బుల్లెట్ ట్రాక్టర్ తో రూ.700 ఖర్చు అవుతుంది. పత్తిలో వచ్చే కలుపును కూడా దీనితో తీయవచ్చు. ఫలితంగా కూలీల కొరతను అధిగమించడం తో పాటు తక్కువ ఖర్చుతో సాగు చేస్తున్నారని వెల్లడించారు.
ఈ బుల్లెట్ ట్రాక్టర్ కు సొంతంగా కల్టివేటర్
కేవలం మొట్ట భూములకు మాత్రమే ఈబుల్లెట్ ట్రాక్టర్ ను వాడుతారు. ఈట్రాక్టర్ తో వచ్చే కల్టివేటర్ కాకుండా తన భూమి అవసరాలకు అనుగుణంగా మరింత సులభంగా వివిధ వ్యవసాయ పనులకు ఉపయోగించడానికి మరో 25 వేలు పెట్టి సొంతంగా కల్టివేటర్ ను తయారు చేసుకున్నారు. ఈబుల్లెట్ ట్రాక్టర్ తో కేవలం ఒక్క లీటర్ డీజల్ తో అతి తక్కువ సమయంలో ఎకరం పొలంను దున్నవచ్చు. సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దీనితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈబుల్లెట్ ట్రాక్టర్ ను కిరాయికి కూడా తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు.
విన్నుత ఆవిష్కరణ మంచి పరిష్కారం
అయితే రైతుల ఖర్చులు తగ్గించడం కోసం చక్కటి పరిష్కారంతో ఒక విన్నుత ఆవిష్కరణను రూపొందించాడు. ఈ బుల్లెట్ ట్రాక్టర్ లో బుల్లెట్ బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనం ఉంటుంది. ఈట్రాక్టర్ తో ఖర్చులు తగ్గించుకోవచ్చుని నల్లగొండ జిల్లా రైతులు తెలిపారు.
Also Read: Bio Products: ఎరువులు, పురుగు మందులతో పనిలేదు.. ఆశలు రేకెత్తిస్తున్న బయో ఉత్పత్తులు.!