Rotary Type Maize Sheller: తెలంగాణా మరియు ఆంధ్రలో మొక్కజొన్న కోతలకు వచ్చాయి. కోత సమయంలో కూలీల కొరత ఉండడం వలన కోత మరియు గింజ వేరు చేయుటకు ఇబ్బందులు ఉన్నట్టుగా రైతులు వాపోతున్నారు. హర్వెస్టర్లు అందరికీ అందుబాటులో లేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. షెల్లింగ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఈ ప్రత్యేక సాధనాల గురించిన వివరాలు పొందుపరచాము. తక్కువ ఖర్చు, శ్రమతో రైతులు సునాయాసంగా మార్కెట్ లో సరైన సమయంలో అమ్మి అధిక లాభాలు గనించే అవకాశం ఉంది.
రోటరీ రకం మొక్కజొన్న షెల్లర్ ఫంక్షన్: పొట్టు తీసిన కంకుల నుండి మొక్కజొన్న గింజలను వేరు చేయుటకు సహాయపడుతుంది.అవి ప్రభావవంతంగా ఉంటాయి మరియు సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. వాటి ఆపరేషన్ చాలా సులభం, అయినప్పటికీ ధాన్యం దెబ్బతినడం వల్ల పరికరాలు సరిపడా సర్దుబాటు కాకపోవచ్చు. హ్యాండిల్ యొక్క టర్నింగ్ ధాన్యాన్ని తీసివేసే డిస్క్ యొక్క స్పైక్లకు వ్యతిరేకంగా కాబ్ను తిప్పడానికి బలవంతం చేస్తుంది.
Also Read: గొట్టపు రకం మొక్కజొన్న షెల్లర్
రోటరీ రకం మొక్కజొన్న షెల్లర్ సంక్షిప్త వివరాలు: ఇది ఫ్రేమ్ (ఇతర భాగాలు అమర్చడానికి), ఫ్లైవీల్(గిరక), హాప్పర్ మరియు త్రీ హెల్లింగ్ గేర్ లు ఉంటాయి. ఇది మానవ శక్తితో పనిచేసే సాధారణ పరికరం.దీనిని ఒక వ్యక్తి ఒక చేతోతో పని చేయించవచ్చు, మరొక చేయితో కండెలను ఒక్కొక్కటిగా అందులో వేయవచ్చు. ఇది దాదాపు పిండి పట్టే మర యంత్రాన్ని పోలి ఉంటుంది. గింజలను వేరు చేశాక కండెలు మరొక రంధ్రం గుండా బయటకు వస్తాయి. ఇది గంటకు 73 కేజీల చొప్పున గింజలు ఒలవడానికి సహాయపడుతుంది.
పెద్ద మొత్తంలో మొక్కజొన్న పండించే రైతులకు ఈ మర యంత్రం మంచి ఉపకారి. సాంప్రదాయ పద్ధతితో పోల్చితే కూలి ఖర్చులో 32% ఆదా అవుతుందని అంచనా. వేళ్లకు గాయం అయ్యే ప్రమాదాలు ఉండవు. దీని వేళ రూ. 6000/- గా నిర్ణయించి మార్కెట్లో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇతర ప్రైవేట్ కంపెనీల షెల్లర్లు కూడా. వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి షేర్పూర్ ఆగ్రో ఇండస్ట్రీస్, G.T. రోడ్, ఫోకల్ పాయింట్, లుధియానా – 141 010, పంజాబ్, భారతదేశం వారి దగ్గర అందుబాటులో ఉంది.
Also Read: ఎరువులు బ్రాడ్కాస్టర్