Robo Weeder: పంట పొలంలో వచ్చే కలుపు తీయాలి అంటే రైతులు చాల ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయంలో కూలీలు దొరక్క , మొక్కలకి అందే పోషకాలు అని కలుపు మొక్కలు తీసుకోవడంతో, పంట మొక్కలు బలహీనంగా పెరుగుతాయి. రైతులు అందరూ ఒకేసారి వ్యవసాయం చేయడం ద్వారా , రైతులకి కూలీలు దొరకడం లేదు దీని అనుకూలంగా తీసుకొని కొంత మంది రైతులు కూలీలకి ఎక్కువ రేట్ ఇచ్చి పొలం పని చేపించుకుంటున్నారు. అందరూ రైతులు ఎక్కువ డబ్బులు ఇవ్వలేక, ఇంటిలో వాళ్ళ సహాయంతో వారి పొలం పనులు చేసుకుంటున్నారు కానీ దీని వల్ల అని పనులు పూర్తి కావడానికి చాలా సమయం,శర్మ పడుతుంది.
Food Security: భారతదేశ వాతావరణంలో మార్పుల వల్ల విత్తనాల పై ఎలాంటి ప్రభావం ఉంటుంది. . . ?
కలుపు మొక్కలని తొందరగా తీయకపోతే, మనం పంటకి ఇచ్చే పోషకాలని కలుపు మొక్క తీసుకుంటుంది. దాని వల్ల కలుపు మొక్కల పక్కన పంట మొక్కలు పెరగడానికి పోటీ పడలేకపోతున్నాయి. కలుపు మొక్కలు , పంట మొక్కల కంటే చాలా తొందరగా పెరుగుతాయి. దానితో కలుపు తీయడం కొంచం ఆలస్యం అయిన పొలంలో మొత్తం కలుపు మొక్కలే కనిపిస్తాయి. రైతులు పొలంలో కలుపు మొక్కలని తొందరగా తీయడానికి ఎన్నో పరికరాలు ఉన్నాయి. కానీ కొన్ని పరికరాలు వాడిన కూడా మళ్ళీ కలుపు తెరిగి వస్తుంది. పంట పెరిగే వరకు కలుపు తీయడం రైతులకి చాల ఇబ్బందిగా మరీనా ఈ రోజుల్లో రైతుల కోసం రోబోట్స్ సహాయంతో కలుపు తీసే పరికరం వచ్చేసింది.
ఈ పరికరం అటానమస్ రోబోటిక్ వీడ్ కంట్రోల్స్ సిస్టమ్స్ తయారు చేశారు. ఈ రోబో పొలంలో పంట వరుసలుగా వెళ్లి కలుపు తీసివేస్తుంది. ఈ రోబోని జీ పీ ఎస్, జి ఐ ఎస్ సాంకేతికలతో రోబో కూలీలా తయారు చేశారు. ఈ రోబో తనని తానే నడుపుకుంటూ పంట పొలం సాళ్లలో, వరసలో తిరుగుతూ కలుపు నివారిస్తుంది.
ఈ రోబోలో కలుపు తీసే పద్ధతులు చాలా ఉన్నాయి. ఈ రోబో గాలి, మంట, చలి గాలి, మైక్రోవేవ్స్ , లేసర్, వాటర్ జెట్ని వాడుకుంటూ కలుపు నివారిస్తుంది. ఈ రోబోలు కేవలం కలుపు మొక్కలని మాత్రమే నివారిస్తాయి పంట మొక్కలకి ఎలాంటి హాని చేయకుండ. ఈ రోబోల ఖరీదు ఎక్కువ ఉండటం వల్ల కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా వీటిని వాడుకోవచ్చు.
Rythu Bandhu: రైతుబంధు జూన్ 26 నుంచి ప్రారంభం…