యంత్రపరికరాలు

Rice Milling Machine: ధాన్యం మిల్లు పట్టు యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.!

1
Rice Milling Machinery
Rice Milling Machinery

Rice Milling Machine: ధాన్యం గింజపై ఉన్న పొరను ఉకపొర అంటారు. ఈ ఊక పొరను తవుడు లేక బ్రౌన్ రైస్ అంటారు. ఈ రైస్ పై ఉన్న పొర (వైట్ రైస్) లేక తెల్లని బియ్యం అంటారు.

ధాన్యం నుండి ఊకను వేరు చేయుట: ఊకను బియ్యపు గింజకు ఎటువంటి హాని కలుగకుండా మరియు నష్టం కలుగ చేయకుండా వేరుచేయుట ‘పాలిషింగ్’ లేక ఊకను వేరు చేయుట అంటారు. ఈ పనికి ఉపయోగించు యంత్రాలు ‘షెల్లర్స్’ అంటారు.

అండరు రన్నరు డిస్కు షెల్లరు: దాన్యపు గింజను నిలువుగా రెండు చివరల అదిమి కొద్దిగా రాపిడి కలిగించిన ఊకపొర చిట్లి బియ్యపు గింజ బయటికి వస్తుంది. ఈ సూత్రంపై ఆధారపడి ఈ యంత్రంతో ఊకను వేరు చేస్తారు.ఈ యంత్రం లో రెండు గుండ్రని మందం కలిగిన రాతి పలకలు సమానంగా ఉండి లేదా ఒకే వ్యాసం కలిగి ఉండి సమాంతరంగా ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటుంది. ]

ఈ రెండింటి లోపలి భాగంలో అనగా రాతి పలక దిగువ భాగం, క్రింది రాతి పలకపై భాగంలో గరుకుదనము కలిగించు పదార్థములతో పూత పూసి సానరాయివలె తయారు చేయబడి ఉంటుంది. రెండు రాతి పలకల మద్య ఖాళీ ఉంచబడుతుంది. ఈ ఖాళీ దాన్యపు గింజ పొడవు కంటే తక్కువగాను బియ్యపు గింజకంటే ఎక్కువగా ఉంటుంది. తిరగకుండా స్థిరముగా బిగించబడి ఉంటుంది. పై డిస్కు పై మధ్య భాగంలో రంధ్రం కలిగి వుండి ధాన్యం క్రింద తిరుగుతున్న క్రింద రాతి పలకపై పంపేటట్లు అమర్చబడి ఉంటుంది.

Also Read: Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!

Rice Milling Machine

Rice Milling Machine

పని చేయు విధానo: తిరుగుచున్న క్రింద రాతి పలకపై పడిన ధాన్యపు గింజలు అపకేంద్ర (Centrifugal force) వలన రాతి పలక మధ్య భాగము నుండి వెలుపలికి నెట్టబడతాయి. గింజలు క్రింది డిస్కు పై తిరుగుతూ బయటకు వచ్చినప్పుడు గింజలు నిలువుగా నిలుచుట జరుగుతుంది. దానిపై ధాన్యపు కొనలు డిస్కుపైగల గరకు సానరతి ప్రదేశమునకు తగిలి రాపిడి వలన ఊక పొర చిట్లి బియ్యపు గింజ మరియు ఊక పొర బయటికి వస్తుంది. ఈ విధంగా బయటకు వచ్చిన బియ్యం మరియు ఊక మిశ్రమంను తూర్పారబట్టి బియ్యంను వేరు చేయవచ్చు.

నష్టాలు: ఈ యంత్రం ఖరీదు ఎక్కువ, నడుపుటకు ఖర్చు డిస్కు షెల్లరు కంటే ఎక్కువ, రోలరుల రబ్బరు ఎక్కువగా మార్చబడి వచ్చుట చేత ఖర్చు అధికo.శిక్షణ పొందిన వారు మాత్రమే నడుపవలసి ఉంటుంది.

అధునిక అండర్ రన్నర్ డిస్కు షల్లరు (Modern under runner disk sheller): ఇపుడు తయారగు క్రొత్త షెల్లర్లలో పై డిస్కు క్రింది భాగము రబ్బరుతో, క్రింది డిస్కు పై భాగము గరుకు సానవలె కలిగిన పదార్థo తో పూత పూయబడి ఉంటుంది. ఈ రబ్బరుని ఒక చెక్కపై అమర్చి ఆ చెక్కను పై డిస్కు క్రింది. భాగంలో స్క్రూల సహాయముతో బిగించడి ఉంటుంది. ఇందులో అమర్చబడిన డిస్కులు చిన్నవిగాను మరియు తక్కువ మందం కలిగి ఉంటుంది.

లాభాలు: ఈ యంత్రం తయారు చేయుట మరియు నడపటం సులభం.నడుపుటకు అగు ఖర్చు చాలా తక్కువ, గరకు సానవంటి పూత ఎక్కువ కాలం మన్నును ఒకవేళ అరిగినట్లయిన దానికి కావలసిన మిశ్రమంను కొని మిల్లు వద్దనే కొత్త పూత వేయవచ్చు.

నష్టాలు: వివధ రకముల పొడవులు కలిగిన దాన్యము గింజలను వేరు చేయుటకు వీలుపడదు. బియ్యం కొనలు అరుగుట లేక గింజలు ముక్కలు అగుట జరుగుతుంది.తవుడు పొరపై రాపిడి కలగడం వలన కొంత తవుడు ఊకలో కలిసి పోవుట జరుగుతుంది.

Also Read: Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదలలో కొన్నిమెళుకువలు.!

Leave Your Comments

Green House Structure: హరిత గృహాల రకాలు మరియు వాటి నిర్మాణాల గురించి తెలుసుకోండి.!

Previous article

Infectious Bronchitis in Chickens: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Next article

You may also like