యంత్రపరికరాలు

Pedal Operated Thresher: పెడల్ ఆపరేటెడ్ త్రేషర్

0
Pedal Operated Thresher
Pedal Operated Thresher

Pedal Operated Thresher: ఇది జపాన్ దేశములో మొదట తయారు చేయబడినది. ఇందులో ముఖ్యముగా ఒక సిలిండరు యుండును. ఈ సిలిండరు దీర్ఘచతురస్రాకారపు కర్ర పలకలతో తయారు చేయబడి యుండును. ఈ పలకల పై మైల్డు స్టీలు వైర్లతో లూపులు బిగించబడి యుండును.

పనిచేయు విధానము:- చిన్న చిన్న వరికట్టలు తిరిగాడుచున్న లూపులు గల సిలిండర్లకు తగిలించుటవలన విత్తనములు వేరగును . సిలిండరు ఎటు ప్రక్కకు తిరుగువలసిన సిలిండరు పై బాణము గుర్తులో గుర్తించబడి యుండును.
కాలి దగ్గర యున్న పెడలును క్రిందకు పైకి ఆడుతున్నట్లు ఈ పెద్ద పళ్ల చక్రము సిలిండరు షాఫ్టునకు లేక ఇరుసునకు బిగించబడి చిన్న పళ్లు చక్రమును త్రిప్పును. మాములుగా సిలిండరు 350 నుండి 400 చుట్లు తిరుగును. సిలిండరు వ్యాసము దాదాపు 45 సెం. మీ యుండి వెడల్పు 50-75 సెం. మీ ఉంటుంది. ఈ త్రేషరు ద్వారా ఒక మనిషి దినమునకు 200-250 కిలోల వరిని నూర్చవచ్చును.

ఆల్ క్రావు త్రేషరు:- ఈ యంత్రమునుపయోగించి వరి , గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు మొదలగునవి పంటలను త్వరగా మరియు సులభముగా తక్కువ ఖర్చుతోను నుర్చుకొనవచ్చును.

Also Read: Multi Crop Thresher: పంట నూర్పిడి యంత్రాలు.!

Pedal Operated Thresher

Pedal Operated Thresher

ముఖ్య భాగములు:-
హాపరు
సిలిండరు
కాంకేవు
జల్లెడలు
బ్లోయరు
ఎలివేటరు
మోటారు
ఫ్రెమ్
ట్రాన్స్ పోర్టింగ్

దీనిలో రాస్ప్ బార్ టైపు సిలిండరును ఉపయోగించెదరు. సిలిండరు తిరుగు వేగము , సిలిండరు మరియు కాంకేవుల మధ్య ఖాళీని అనువుగా మర్చి పైన చెప్పబడిన పంటలను నూర్చవచ్చును. ఈ యంత్రమును 5 హెచ్. వి. గల అయిలు ఇంజనుగాని ఎలక్ట్రికల్ మోటారుతో గాని నడపవచ్చును.

పనిచేయు విధానము:-
వరి, గోధుమ పంటలను నూర్చుటకు పంట కట్టలను హాపరు ద్వారా సిలిండరు, కాంకేవుల మధ్య గల కాళీ ప్రదేశములోనికి పంపవలయును. జొన్న, సజ్జ, మొక్క జొన్న మొదలగు పంటలను సిలిండర్, కాంకేవు కాళీ ప్రదేశంలో కంకులకు, కంకులకు మధ్య రాపిడి జరిగి విత్తులు వేరగును. ఇట్టు వేరు చేయబడిన గింజల చెత్త కాంకేవు ఖలీ నుండి క్రింద వున్న జల్లెడలపై పడును. ఈ విధముగా పడునపుడు చెత్త, గడ్డి తునకలు , గుల్ల గింజలు మొదలగు బ్లోయరు గాలికి దూరముగా బయటకు నెట్టబడును. మంచి గింజలు జల్లెడలు ద్వారా క్రింద అమర్చబడిన సంచులలోనికి చేరును.

సిలిండరు , కాంకేవుల మధ్య నలుపబడిన గడ్డి బ్లోయరు ద్వారా గడ్డి చట్రము పైకి నెట్టబడును. ఈ గడ్డి చక్రము ముందుకు, వెనుకకు కదులుచుండును.ఈ కదలికవలన గడ్డిలో మిగిలియున్న గింజలు తిరిగి జల్లెడ పై పడును.. గడ్డి బయటకు నెట్టబడును. దీనినుపయోగించి రోజుకు దాదాపు 15-20 క్వింటాళ్లు వరకూ నూర్చబడును.

Also Read: Power Thresher: పవర్ త్రేషర్ లోని ముఖ్య భాగాలు మరియు పని చేయు విధానం.!

Leave Your Comments

Troublesome Weeds: సమస్యాత్మక కలుపు మొక్కల నిర్మూలన.!

Previous article

Modern Agriculture Drones: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత.!

Next article

You may also like