Paddy Harvesting Machines – ఎ. రీపరు, రీపర్ కంబైనర్ : వరి చిన్న కమతాలలో పండిరచినప్పుడు, పెద్ద కంబైనర్ల వంటి యంత్రాలతో కోసి నూర్పిడి చేయడం అసాధ్యం చాలా కష్టం. అదీకాక కంబైనులతో కోయడం వలన సుమారు 40-50 శాతం వరి గడ్డి పొలంలో వదిలి వేయవలసి వస్తుంది. చిన్న, సన్న కారు రైతులు ఇలా వరి గడ్డిని నష్టపోయేందుకు ఇష్టపడరు. ఇందుకుగాను అనగా చిన్న కమతాలలో మరియు వర్ గడ్డిని నష్టపోకుండా కోసేందుకు రీపరు లేదా కంబైండర్ రూపొందించబడినది.
ఇందులో రీపర్ను ఉపయోగించడం ద్వారా వరి పంటను గడ్డితో బాటు కోసి ఒక్క ప్రక్కకు నెట్టి వరుసగా పేరుస్తుంది దీనిని తీసుకొని ఆల్ క్రాప్ ట్రెషర్ ద్వారా గాని లేదా కూలీలతో పెడల్ ఆపరేటర్ త్రెషర్ ఉపయోగించి నూర్పిడి చేయవచ్చును. అదే రీపర్ కమ్ బైండర్ అయితే వరి గడ్డిని కోసి కట్టలు కట్టి పొలంలో విడుస్తుంది. ఇలా కట్టలు కట్టడం వలన పొలం నుండి నూర్పిడి చేసే స్థలానికి సులువుగా చేర్చవచ్చును. అంతే కాక ధాన్యం నష్టపోకుండా నూర్పిడి చేయడం వీలవుతుంది. ఈ యంత్రాల ఖరీదు రూ? 1,00,000/- రీపర్ మాత్రమే, అదే రీపర్ కంబైండర్ అయితే రూ.3,50,000/-, దీని సామర్థ్యం రోజుకు 3 నుంచి 5 ఎకరాలు వరకు సమర్ధవంతంగా చేయవచ్చును.
బి. కంబైన్డ్ హార్వేస్టర్ :
ఈ వరికోసే యంత్రాలలో ముఖ్యంగా చక్రాలను అమర్చినవి మరియు బెల్టు చక్రాల ద్వారా నడిచేయంత్రాలు ఉన్నాయి. చక్రాల కోసేయంత్రాలను తేలికపాటి నేలలో మరియు ఇసుకశాతం ఎక్కువగా ఉండే వరిపొలాలలో సమర్థవంతంగా వాడవచ్చును. ఈ యంత్రాన్ని నల్లరేగడి నేలల్లో అనగా చక్రాలు దిగబడిపోయే నేలల్లో వాడేందుకు వీలుకాదు. అదే బెల్టు చక్రాలు ఉన్న యంత్రాలను ఏ నేలలోనయినా సమర్థవంతంగా వాడి వరి, గోధుమ పంటను కోసి నూర్పిడి చేయవచ్చును.
దీని ఖరీదు రూ. 14 లక్షల నుండి రూ. 16 లక్షలు వరకు ఉంటుంది. ఇదే కంబైన్డ్ హార్వేస్టర్లను కొద్ది పాటి మార్పులతో మొక్క జొన్న పంటను కోసి నూర్పిడి చేసేందుకు కూడా వాడవచ్చును. యంత్రాన్ని వాడి మొక్క జొన్న మొక్కతో పాటు కోసి దాని తరువాత నూర్చి మొక్క మరియు కంకి భాగాన్ని పొడి, వేరు చేసి నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను మాత్రమే ఒక దగ్గర సంచుల ద్వారా పొందేందుకు వీలవుతుంది. ఇదే యంత్రాన్ని ముందరి కట్టర్ బార్న మార్చి వరికోసి నూర్చే యంత్రంగా వాడుకొనేందుకు వీలైన నిర్మాణాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. దీని ఖరీదు రూ. 19 లక్షలు.
Also Read: Stem Borer in Rabi Paddy: యాసంగి వరిని ఆశిస్తున్న కాండం తొలిచే పురుగు`ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం
సి. వరి గడ్డి కట్టలు కట్టే యంత్రము :
మన రాష్ట్రంలో వరి పంటను 60-70 శాతము కంబైన్ హర్వెస్టర్ ద్వారా కోసి నూర్పిడి చేయబడుతుంది. కానీ ఇలా చేయడం వలన పొలంలో వదిలివేయబడ్డ వరి గడ్డిని తీసి పశుగ్రాసంగా వాడడం చాలా శ్రమతో కూడినది మరియు ఎక్కువ కూలీల అవసరం పడుతుంది. ఇందువలన ఒక్కోసారి వరిగడ్డిని పొలంలో కాల్చేయడం జరుగుతుంది. ఇలా నష్టపోకుండా, పొలంలో పడిన గడ్డిని తీసి కట్టలు కట్టేందుకు వీలుగా ఈ యంత్రమును రూపొందించడం జరిగింది.
ఈ యంత్రము ట్రాక్టరు పి.టి.ఓ. సహయంతో నడుపబడుతుంది. ఈ యంత్రముతో వరి గడ్డి రెండు విధాలుగా కట్టలు కట్టబడుతుంది. ఒక రకంలో కట్టలు గుండ్రంగా చుట్టలుగా చేయబడుతుంది. మరొక రకంలో గడ్డిని చతురస్రాకారంగా కాని లేదా దీర్ఘచతురస్రాకారంగా కాని కట్టలను చేసి పొలంలో వదులుతుంది. ఈ యంత్రంలో ముఖ్యంగా కలెక్టరు, బైండర్/రామర్, అన్డర్ అనే పరికరాలుంటాయి.
Also Read: Phytohormones Importance: మొక్కలలో ఫైటోహార్మోన్ల ప్రాముఖ్యత.!