Hand Weeder: వర్షాకాలం మొదలు అవ్వగానే రైతులు పంట పొలంలో పంటలు సాగు చేస్తున్నారు. పంటలు వేశాక మొదటగా ముఖ్యమైన సమస్య కలుపు. పంటలో కలుపు తీయడానికి చాలా పరికరాలు ఉన్న కూడా వాటిని వాడటం కొంచెం ఇబ్బంది. మహిళా రైతులు మాత్రమే కలుపు మొక్కలు తీస్తారు. వాళ్ళకి పొలంలో కూర్చొని కలుపు తీయడం చాలా ఇబ్బంది. ఇప్పటి కాలంలో ఎక్కువ శాతం జనాలకి మోకాళ్ళ నొప్పులు, ఇతర సమస్యలు తొందరగా వస్తున్నాయి. అటువంటి వాళ్ళు పొలంలో పని చేయడానికి చాలా ఇబ్బంది. మహిళా కలుపు కూలీల సమస్యలు తీర్చడానికి హ్యాండ్ వీడర్ అని ఒక కొత్త పరికరం వచ్చింది.
Also Read: Nematode Control in Calves: దూడలలో వచ్చే ఏలికపాముల నివారణ
హ్యాండ్ వీడర్ ద్వారా నిల్చొని సులువుగా కలుపు తీసుకోవచ్చు. దీనికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ ముందు భాగంలో బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ పరిమాణం బట్టి హ్యాండ్ వీడర్లో రెండు రకాలు ఉంటాయి. తొమ్మిది ఇంచుల హ్యాండ్ వీడర్, మూడు ఇంచుల హ్యాండ్ వీడర్. తక్కువ దూరం ఉన్న మొక్కలు మూడు ఇంచుల హ్యాండ్ వీడర్ వాడుతారు. మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉంటే తొమ్మిది ఇంచుల హ్యాండ్ వీడర్ వాడుతున్నారు.
ఈ హ్యాండ్ వీడర్ ఫ్రేమ్ పై భాగంలో కర్ర లేదా ఇనుప రాడ్ పెట్టుకోవచ్చు. ఈ రాడ్ పట్టుకొని కలుపు మొక్కలను చెక్కుకోవాలి. ఇలా చెక్కుకుంటే కలుపు మొక్కలు వేర్లు నుంచి వస్తాయి. కలుపు మొక్క వేర్ల నుండి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆ చోట కలుపు మొక్క పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఈ పరికరాన్ని మహిళలు చాలా సులువుగా వాడవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ పరికరాన్ని సులభంగా తీసుకోవచ్చు. ఈ పరికరం కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ పరికరం కొనుగోలు లేదా దీని గురించి మరింత సమాచారం కొరకు… ఈ 7386403652 నెంబర్ సంప్రదించండి.
Also Read: Pregnancy Tests in Cattle: పాడి పశువుల చూడి నిర్ధారణ