Naveen Dibbler and Rotary Dibbler: ఈ పరికరాన్ని CIAE, భోపాల్ అనే సంస్థ అభివృద్ధి చేసారు. ఆటోమేటిక్ డిబ్లర్ అనేది మాన్యువల్‌గాచేతితో పనిచేసే సాధనం. దీనికి విత్తన తొట్టి, విత్తనాలను లెక్కపెట్టడానికి సెల్ రకం రోలర్, మట్టిలోకి రంధ్రం చేసుకొని లోపలికి పోవడానికి స్ప్రింగ్ యాక్చువేటెడ్ దవడలు,దవడల కోసం లివర్ రకం పవర్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, డెలివరీ సిస్టమ్‌తో కూడిన సీడ్ బాక్స్ , పైపు మరియు హ్యాండిల్ అనే భాగాలు ఉంటాయి.
ఈ పరికరాన్ని బోల్డ్ లేదా పెద్ద విత్తనాలను విత్తడానికి (మొక్కజొన్న, సోయాబీన్ వంటివి) లేదా తక్కువ విస్తీర్ణంలో ఖరీదైన/కొరత ఉన్న విత్తనాల కోసం మరియు గ్యాప్ ఫిల్లింగ్ చేయడం కోసం ఉపయోగిస్తారు.
పొలంలో విత్తుకునే సమయంలో కావలసిన విత్తనాలని విత్తన తొట్టిలో నింపుకోవాలి ఆ తర్వాత కార్మికుడు డిబ్లర్‌ను కావలసిన స్థలంలో పెట్టుకొని , దవడను తెరవడానికి మీటను (డిబ్లర్ ముందు) మెల్లగా నొక్కాలి, తద్వారా విత్తనం మట్టిలో పడిపోతుంది.దీని సామర్థ్యం ఒక గంటకు సుమారు 150 m2 .ఈ పనికరం యొక్క ధర 700 రూపాయలు.
Also Read: రోటరీ రకం మొక్కజొన్నషెల్లర్
నవీన్ డిబ్లర్ లాభాలు: ఇది సాధారణంగా సాంప్రదాయ పద్ధతి వలే వంగే అవసరం లేకుండా విత్తనాలను విత్తుకునే అవకాశం కల్పిస్తుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ డిబ్లర్‌తో యూనిట్ అవుట్‌పుట్‌కు దాదాపు 13 శాతం కార్మికుల కార్డియాక్ ఖర్చు ఆదా అవుతుంది . దీని ద్వారా లైన్లో విత్తుకోవచ్చు కావున మెకానికల్ కలుపు తీసే యంత్రాన్ని వినియోగించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కలుపు తీసే సమయం, శ్రమ మరియు ఖర్చు తగ్గుతుంది. విత్తన పొదుపు కూడా సాధించవచ్చు.
రోటరీ డిబ్లర్ : ఈ పరికరాన్ని CIAE, భోపాల్ అనే సంస్థ అభివృద్ధి చేసారు. దీనిని సోయాబీన్, జొన్న మరియు మొక్కజొన్న వంటి పెద్ద మరియు మధ్యస్థ సైజు గింజలను తక్కువ విస్తీర్ణంతో లేదా గ్యాప్ ఫిల్లింగ్ కోసం లేదా మీడియం లేదా ఖరీదైన/కొరత విత్తనాలను విత్తడానికి వాడుతారు.ఇది మ్యానువల్గా వాడే పుష్ రకం పరికరం. ఇది బాగా తయారు చేసిన మట్టిలో వరుసల నడుమ ఒకే విధమైన అంతరంతో పెద్ద మరియు మీడియం సైజు గింజలను విత్తుకోవడానికి వాడే పరికరం. దీని యొక్క సామర్థ్యం గంటకు 500 m2.
రోటరీ డిబ్లర్ ప్రయోజనాలు : మొక్కజొన్న, సోయాబీన్ మరియు కందుల వంటి పెద్ద విత్తనాలను డిబ్లింగ్ చేయడానికి వాడుతొరు. ఈ పరికరం యొక్క ధర 2300/-
Also Read: గొట్టపు రకం మొక్కజొన్న షెల్లర్