Nano Tractor: ట్రాక్టర్ వచ్చాక వ్యవసాయం తీరుతీన్నులే మారిపోయాయి. జోడెడ్లు చేసే పొలం పనులు అన్నింటిని అత్యంత వేగంగా సులభంగా ట్రాక్టర్ చేస్తోంది. పొలం దున్నడం, విత్తనాలు వేయడం, కలుపుతీత, మందుల పిచికారి, పంటకోత లాంటి అన్ని పనులకు ట్రాక్టర్ లేకపోతే వ్యవసాయం లేదు అన్నట్టుగా భాగం అయ్యింది. సాధారణంగా పెద్ద కమతాలు ఉన్న రైతులు స్తోమత కలిగిన రైతులు ట్రాక్టర్ ల ను కొనుగోలు చేసి సొంతంగా వాడుకోవడం, లేదా బాడిగకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 30 హెచ్పి పైన ఉన్న పెద్ద ట్రాక్టర్లు 5 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. తక్కువ ఖర్చుతో చిన్న ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీతో నడిచే ఒక చిన్న ట్రాక్టర్ ను రైతులకు అందుబాటులోకి వస్తే ఎంతో మేలుగా ఉంటుంది కదా
మూడు చక్రాల తో నడుస్తున్న ట్రాక్టర్
వ్యవసాయం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎడ్లు, నాగలి, పూర్వ కాలంలో సాగు చేయడానికి వీటినే ఉపయోగించేవారు. ఇక వ్యవసాయ పనుల్లో రైతులకు ఎడ్లు ఎంతో ఉపయోగపడేవి. అయితే వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఈమధ్య కాలంలో వాటి అవసరం లేకుండానే రైతులు తమ వ్యవసాయ పనులను చేసేసుకుంటున్నారు. ఈ నేపద్యంలో వ్యవసాయ పనులకు ఒక విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు చక్రాల తో నడుస్తున్న ట్రాక్టర్ ఈనానో ట్రాక్టర్, ఈఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ రూపొందించబడింది. విత్తడం, కలుపుతీత మందు పిచికారి, వంటి అన్ని పనులను దీనితో సులభంగా చేయవచ్చు. కూలీలు కరువు ఆవుతున్న వేళ బ్యాటరీ యంత్రం ఎంతో అనుకూలంగా ఉందన్నారు.
Also Read: Sugarcane Farmers: చెరకు రైతుల బకాయిలు చెల్లించాం – కేంద్ర మంత్రి
ప్రత్నాయంగా నానో ట్రాక్టర్
ప్రస్తుత్తం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూలీల లభ్యత లేకపోవడం, సేద్యంలో ఖర్చు పెరిగిపోవడం, టైంకు కూలీలు రాకపోవడం వల్లన అనుకున్న సమయానికి పంట వేయలేకపోవడం, లేటుగా పంట దిగుబడులు రావడంతో అన్నదాత కష్టాల్ని చవిచూడాల్సి వస్తుంది. దీనికి ప్రత్నాయంగా నానో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. ఈయంత్రంతో కూలీల సమస్య లేకుండా పెట్రోల్, డీజల్ ఖర్చు లేకుండా వ్యవసాయ పనులను సులువుగా చేసుకోవచ్చు. దీంతో అంతర పంటలను కూడా సాగు చేయవచ్చు.
రైతుకు అందుబాటులో ధరలో 1,75000 ఖరీదుతో, విత్తు వేయడం దగ్గర నుంచి కోత వరకు అన్ని పనులను దీని ద్వారా చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. దీని ద్వారా సమస్యలను అధిగమించి దానిద్వారా మనకు ఎంతో లాభం చేకూరుతుంది కాబట్టి ఇలాంటి యంత్రాలు అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.
Also Read: Agri Youth Summit – 2023: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా ప్రారంభమైన అగ్రి యూత్ సమ్మిట్ – 2023