Pumping Water Without Electricity: కొందరికి చదువు లేకపోయినా, శాస్త్రవేత్తలను కూడా తమ చర్యలతో శెభాష్ అనిపించుకుంటూ ఉంటారు. ఓరైతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. కరెంటు లేకపోతే కనీసం ఫ్యాను కూడా తిరగదు. అయితే ఆ రైతు ఏకంగా విద్యుత్ లేక పోయినా నీరు తోడే మోటార్ తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. రైతు చేసిన తెలివైన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ రైతు ఏం చేశారో తెలుసుకుందాం.
బోరు నుంచి నీరు బయటకు రావాలంటే మోటారు ఉండాలి. కరెంటు కూడా ఉండాలి. లేదంటే బోరింగ్ పంపు అయితే చేతితో ఆపరేట్ చేయడం ద్వారా నీరు బయటకు తీయవచ్చు. అయితే రైతు బోరు నుంచి కరెంటు లేకుండా తన తెలివితేటలతో నీరు బయటకు తోడేస్తున్నారు. బోరు మోటారు ఎదురుగా ఓ స్టాండ్‌పై మోటారుతో పాటూ ఓ చక్రాన్ని కూడా అమర్చారు. ముందుగా చేత్తో కొద్ది సేపు ఆ చక్రాన్ని వేగంగా తిప్పుతున్నాడు. ఆ తర్వాత బోరు నుంచి వచ్చే నీరు ఎదురుగా ఉన్న మరో చక్రంపై పడి అది తిరుగుతోంది. ఆ చక్రం తిరగడం వల్ల అక్కడ కరెంటు ఉత్పత్తి అవుతోంది. దీంతో మోటారు రన్ అవుతోంది. దీని వల్ల వేగంగా బోరు నుంచి నీరు బయటకు వస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read: Storage of Groundnut: వేరుశనగ కాయలను నిల్వఉంచేటప్పుడు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు.!
ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి
రైతు ఐడియాకు ఇంజనీర్లు కూడా మెచ్చుకుంటున్నారు. కరెంటుతో పనిలేకుండా స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి బోరు నుంచి నీరు బయటకు తీయడమే కాదు. పొలంలో లైట్లు కూడా వెలిగిస్తున్నాడు ఆరైతు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరైతు తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. కరెంటు కోతలు వేసే బదులు ఇలా అందరూ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తే ఇక కరెంటు కోత అన్న మాటే వినిపించదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
శాస్త్రీయత ఉందా?
రైతు తయారు చేసిన మోటార్ ఆగకుండా తిరుగుతుందా? లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బోరు నుంచి వచ్చే నీటి వేగానికి తయారయ్యే విద్యుత్ తో మరో మోటారు తిరగడం సాధ్యం కాదని కొందరు ఇంజనీర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా రైతు ఐడియాను మెచ్చుకోవాల్సిందే. చదువు లేకపోయినా ఇంజనీర్లను సైతం మెప్పించిన రైతు చేసిన పని దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. పొలానికి నీరు పారించి పది మందికి అన్నం పెట్టేందుకు రైతు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Also Read: PJTSAU: రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ను సందర్శించిన డాక్టర్ ద్రువ్ సూద్