Innovative Umbrella: రైతులకు, వ్యవసాయ కూలీలకు వేసవి కాలం ఎండా లో పని చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతారు. మధ్యాహ్న సమయంలో 2-3 గంటలు సేపు పనులకు విరామం ఇచ్చి చెట్లు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. మహిళా కూలీలు ఎండా కాలంలో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. పత్తి, కూరగాయల తోటల్లో, మిరప మొదలైన వాటిలో కూలీలు ఎక్కువగా అవసరం ఉంటుంది. పెరుగుతున్న ఎండలకు కూలీలు సకాలంలో పనులు పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఎండ కష్టాలను తీర్చడానికి రైతులు, వ్యవసాయ కూలీలు నీడలో పని చేయడానికి కంబాలపల్లి ఊరు, మహబూబాబాద్ జిల్లాలో ఉండే మోటార్ మెకానిక్ అయిన రేపల్లె షణ్ముగరావు గారు “పెద్ద గొడుగు” అందుబాటులోకి తెచ్చారు.
ఈ పెద్ద గొడుగు కూలీలకు ఎండ, వడదెబ్బ తగలకుండా నీడను ఇస్తుంది. ఈ పెద్ద గొడుగు 20 అడుగుల పొడుగు, 6 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు, 15-18 కిలోల బరువు ఉంటుంది. ఇనుప పైపులతో చేసే ఈ గొడుగును, 10 నిమిషాల్లో నట్లు, బోల్ట్ సహాయంతో ఒక్కదగ్గరికి చేర్చి గొడుగులా నిలపెట్టవచ్చు. గొడుగు ఫై భాగం ధాన్యం సంచులు లేదా ఇతర సంచులు వరసగా కుట్టి పరదాల వేసుకోవచ్చు. ధాన్యం సంచులు ఉపయోగించడం వల్ల గొడుగు తయారీలో ఖర్చు తగ్గుతుంది. గొడుగు అడుగు భాగంలో చక్రాలు ఏర్పాటు చేయడం వల్ల నీడ పడే స్థలంలో పని పూర్తి అయ్యాక వేరె స్థలంలోకి సులభంగా ముందుకు తోసి తీసుకొని వెళ్తారు. నట్లు, బోల్ట్ సహాయంతో ఏర్పాటు చేయడంతో పని పూర్తియ్యాక అన్ని విడదీసి, మడుచుకొని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. దీని తయారీకి 5-6 వేలు అవుతుంది.
Also Read: Tamarind Seeds: ఎందుకు పనికిరావు అని పడేసే చింత గింజలతో లక్షలు సంపాదించుకోవడం మీకు తెలుసా ?
30 సంవత్సరాలుగా మోటార్ మెకానిక్ పని చేస్తున్న షణ్ముగరావు గారు రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఎండాలో పని చేసే వారిని చూసి , వారికి ఏదో ఒక సహాయం చేయాలి అనుకొని ఈ పెద్ద గొడుగును తయారు చేసారు. కొలతతో ఎవరైన ఈ గొడుగును తయారు చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న వెల్డింగ్ వ్యక్తికి ఈ కొలతలతో చెప్పి గొడుగును తయారు చేపించుకోవచ్చు. ఈ గొడుగు తయారీలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే,షణ్ముగరావు గారికి ఫోన్ చేసి మాట్లాడితే వివరంగా చెపుతారు. షణ్ముగరావు గారికి దగ్గరిలో ఉన్న వారికి అతనే ఈ గొడుగును తయారు చేసి ఇస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉండే వారికీ రవాణా చార్జీలు ఎక్కువ అవడం వల్ల, ఇతను చెప్పే కొలతల్లో తయారు చేసుకోవడం మేలు అన్ని అంటున్నారు.
రైతులకు, కూలీలకు ఈ పెద్ద గొడుగు ఎంతో ఉపయోగపడుతుంది. పత్తి, మిరప, కూరగాయల తోటలో పని చేసుకునే రైతులకు, కూలీలకు నీడలో పని చేస్తూ, పని సులభంగా చేసుకోవడానికి వాడుకుంటున్నారు. రేపల్లె షణ్ముగరావు గారు 5 సంవత్సరాలలో 8 నూతన ఆవిష్కరణలు చేశారు. వరసగా 4 సంవత్సరాలు ఉత్తమ ఆవిష్కరణ అవార్డును కలెక్టర్ గారి నుంచి అందుకున్నారు.
రేపల్లె షణ్ముఖరావు (9492113609) , కంబాలపల్లి , మహబూబాబాద్ జిల్లా
Also Read: Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?