Agricultural Machines: వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం వచ్చింది. ఆధునిక టెక్నాలజీ కారణంగా వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు రైతు పొలంలోకి దిగి చెమటోడ్చి పనిచేసేవాడు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ క్షణాల్లో పనిని పూర్తి చేస్తున్నాడు రైతు. పంట మొదలు పంటను కోసే వరకు అద్భుతమైన మెషినరీలు అందుబాటులోకి వచ్చాయి. మెషినరీలు రైతుల కష్టాలను తగ్గించడమే కాకుండా విలువైన సమయాన్ని అదా చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి.
క్యారెట్ హార్వెస్టర్:
ఈ క్యారెట్ యంత్రాన్ని డేనిష్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అత్యంత టెక్నలాజిని ఉపయోగించి ఈ యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రం భూమి లోపల ఉన్న క్యారెట్లను బయటకు తీయడంలో మంచి నేర్పరి. ఒక మనిషి రోజంతా కష్టపడి ఎన్ని క్యారెట్లను బయటకు తీయగలడో.. ఈ యంత్రం కేవలం ఒక్క నిమిషంలోనే బయటకు తీస్తుంది. ఈ యంత్రానికి ముందు భాగం బ్లేడ్స్ లాంటి ఫోక్స్ ఉంటాయి. అవి పంటను బలంగా లాగుతాయి. కింద ఉన్న బ్లేడ్స్ భూమిని తవ్వుకుంటూ వెళ్తుంది. దీని వల్ల క్యారెట్లను ఆరోగ్యంగా హార్వెస్ట్ చేయవచ్చు.
ఫ్లెమింగ్ ట్రాక్టర్:
చాలా మంది రైతులు పంట పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తగలబెడతారు. ఇలా చేయడం ద్వారా కాలుష్యం ఏర్పడటమే కాకుండా మంటలు ఇతర పంటలోకి వెళ్లి ఇతర పంటలకు కూడా హాని చేస్తున్నాయి. దీంతో ఈ విధానానికి చెక్ పెట్టాలంటే టెక్నాలజీని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం ఈ ఫ్లెమింగ్ రకం ట్రాక్టర్ అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. ఈ ట్రాక్టర్ కు ఒక నేల సాగు యంత్రం అమర్చి ఉంటుంది. దాంట్లో నుండి మంటలు వాస్తు ఉంటాయి. నిజానికి ఈ మెషిన్ ని పంట పూర్తయిన తర్వాత కొత్త పంట వేసే సమయంలో భూమిని కొత్త పంటకు సిద్ధం చేయడానికి వాడతారు. భూమిలో ఉన్న పాత పంట వ్యర్ధాలను బయటకు తీసి భూమిని శుభ్రంగా తయారు చేసేందుకు ఈ మెషిన్ సహాయపడుతుంది.
ట్రక్స్ స్పేడ్:
పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. అయితే అభివృద్ధిలో భాగంగా కొన్ని సార్లు చెట్లను తొలగించాల్సి ఉంటుంది. రోడ్లు వేసేందుకు, ప్రాజెక్టులు నిర్మించేందుకు, ఇతర అవసరాల కోసం కొన్ని సార్లు చెట్లను తొలగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పెద్ద పెద్ద చెట్లను ఉపయోగం లేకుండా నరికేస్తుంటారు. అయితే అలా భారీ వృక్షాలను నేలకూల్చడానికి చెక్ పెట్టాలంటే ట్రక్స్ స్పేడ్ ని వాడకంలోకి తీసుకురావాలి అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఈ మెషిన్ ని ఆస్ట్రేలియా కంపెనీ తయారు చేసింది. ఇది హైడ్రోలిక్ తో రూపొందిన మోడ్రన్ మెషిన్. దీనికి ఆరు మెటాలిక్ ప్యార్టెన్స్ ఉంటాయి. అవి భూమి లోపలి మొక్క వేర్లకు ఎటువంటి నష్టం కలిగించకుండా చెట్లను సురక్షితంగా బయటకు తీస్తాయి. ఈ మెటాలిక్ ప్యార్టెన్స్ లోపలి వెళ్ళాక హైడ్రాలిక్ అర్మ్స్ తో కలిసి చెట్టును గట్టిగా పట్టుకుంటాయి. కష్టతరమైన ఈ ప్రక్రియ తర్వాత ట్రక్స్ స్పేడ్ చెట్టు మొత్తాన్ని పైకి లేపుతుంది. తీసిన చెట్టుని మరోచోట భద్రంగా నాటవచ్చు. సాధారణంగా పబ్లిక్ పార్కులను తయారు చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతారు.