Mist Blower Sprayer: రైతులు పండించే పంటలో ఎరువులు, పరుగుల మందులు పిచుకరికి స్ప్రేయర్స్ వాడకం చాలా సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు. స్ప్రేయర్లతో పిచుకరీ చేయడం ద్వారా మందులు నీటి బిందువుల రూపంలో పడి కొంత వరకు వృధా అవుతాయి.ఈ నీటి బిందువులు మొక్కల పై పడే లోపు గాలిలోనే ఆవిరి అవుతాయి. పిచుకరీ సమయంలో ఎరువులు వృధా కాకుండా ఉండడానికి మిస్ట్ బ్లోయర్ వాడుతున్నారు.
స్ప్రేయర్ నీటితో వాడుతాం కాబట్టి అందులో పంప్ వాడుతారు. మిస్ట్ బ్లోయర్ మోటార్ సహాయంతో వాడుతారు. ఈ మిస్ట్ బ్లోయర్ గాలిని పీల్చుకొని ఎరువులతో కలిసి పౌడ్ర్గా బయటికి వస్తుంది. దీనిలో పౌడరుగానే కాకుండా లిక్విడ్ రూపంలో కూడా బ్లో చేసుకోవచ్చు. ఈ మిస్ట్ బ్లోయర్ రెండు రకాలు ఉంటుంది. లిక్విడ్, పౌడర్ రెండు రకాలు ఉంటుంది. పిచికారీ చేసి ఎ విధంగా కావాలి అంటే అలాగా ట్యాంక్ని మార్చుకోవాలి.
Also Read: Trellis Method: పందిరి పంటలు ఒక చోటు నుంచి మరో చోటికి తరలించుకొని సాగు చేసే విధానం మీకు తెలుసా…
ఈ మిస్ట్ బ్లోయర్ ద్వారా పంటకి బ్లో చేయడం ద్వారా పురుగుల మందులు 40% వృధా కాకుండా ఉంటుంది. ఇందులో ట్యాంక్ కెపాసిటీ 13-14 లీటర్లు ఉంటుంది. 25 అడుగుల వారికి బ్లో చేసుకోవచ్చు. గాలి వీచే వైపుగా బ్లో చేసుకుంటే ఇంకా ఎక్కువ దూరం వరకు వెళ్తుంది. దీనితో ఎరువులు లేదా పురుగుల మందులు వెయ్యడం ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది.
ఒక లీటర్ పెట్రోల్తో సుమారు 7-8 ట్యాంక్స్ బ్లో చేసుకోవచ్చు. బ్లోయింగ్ కూడా పంట మొక్కలకి సమానంగా వ్యాపిస్తుంది. ఈ బ్లోయింగ్ పద్దతిలో వాడడం వల్ల నీటి బిందువు కంటే చిన్నగా పడటం ద్వారా మొక్కలు ఎరువులను తొందరగా తీసుకుంటాయి. ఒక మిస్ట్ బ్లోయర్ ధర 29-37 వేల వరకు ఉంటుంది. ఇంజిన్ సిసి, ట్యాంక్ కెపాసిటీ బట్టి రేట్ మారుతుంది.
Also Read: Water Bubble Gate Valve: ఈ పరికరం ద్వారా ఎరువులు సులువుగా వేసుకోవచ్చు…