Really Agricultural Manual Seeder: పిట్ట కొంచెం కూత గణం అన్నట్లు అతి చిన్నగా ఉండే ఈ పరికరం కేవలం ఒక్క మనిషి సహయంతో 20 మంది చేసే పనిని సులువుగా చేస్తుంది. మెట్టభూములకు అనువైన ఈ పరికరంతో ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, శనగ, వేరుశనగ, మినుము, పెసర, బెండ ఇలా వివిధ రకాల పంటలను సులభంగా విత్తుకోవచ్చు.
రియల్లీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చిన ఈపరికరానికి ఇందనం అవసరం లేదు. దీనిని మాన్యువల్ సీడర్ లేదా హ్యాండ్ పుష్ సీడర్ అంటారు. విజయవాడ మాగంటి ఎంటర్ ప్రైజెస్ వారు ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తుకోవచ్చు. సీడర్ వెనుక ఉన్న రోలర్ విత్తనంపై ఉన్న మట్టిని కప్పేస్తుంది. 12 పళ్లు ఉన్న ఈ పరికరానికి తొమ్మిది విత్తన రకాల చంద్రికలను అందిస్తున్నారు. విత్తన సైజును బట్టి చంద్రికను మార్చుకోవాల్సి వస్తుంది.
3,4 ఎకరాల్లో విత్తనం వేసుకునే వెసులుబాటు
మెట్ట భూముల్లో విత్తనం వేసే పనిని సులభం చేస్తున్నాయి. ఈ ఆధునిక సీడర్ యంత్రాలు. ఇప్పటి వరకు ట్రాక్టర్ తో ఉపయోగించుకునే సీడ్ డ్రిల్స్ అధికంగా వాడకంలో వున్నా. ఇటీవల కాలంలో మాన్యువల్ సీడర్ రైతులకు మరింత ఉపయోగకరంగా మారాయి. రైతు స్వయంగా రోజుకు 3 ఎకరాల్లో విత్తనం వేసుకునే వెసులుబాటు ఈ ఆధునిక సీడర్ లో వుంది. అన్ని రకాల మెట్ట పంటలు దీంతో విత్తుకునే ఆవకాశం ఉంది. రియల్లీ అగ్రిటెక్ రూపొందించిన మాన్యువల్ సీడర్ లో రైతులకు మేలు చేసే మరిన్ని అంశాలు వుండటంతో దీని వాడకం పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దీని ధర కేవలం రూ. 8000 మాత్రమే.
మాన్యువల్ సీడర్ ద్వారా అన్ని రకాల విత్తనాలను రైతులు విత్తుకోవచ్చు. దీని ధర కేవలం రూ. 8000 మాత్రమే. కొంతమంది రైతులు దీనిని తీసుకొని శ్రమను తగ్గించుకుంటున్నారు.. దీనిని అన్ని నేలల్లో ఉపయోగించుకోవచ్చు. అయితే విత్తనం వేసేటప్పుడు నేల పొడిగా ఉండాలి. అయితే ఈ సీడర్ ద్వారా విత్తనం వేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది.. ఈ పరికరం ద్వారా ఎకరానికి 2000 ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా వరుసలో మొలకలు సమానంగా వస్తాయి అన్నింటికంటే కూలీల కొరతను తగ్గిస్తుంది.
Also Read: Punasa Mangoes: ఏడాదిలో రెండుసార్లు కాపు నిచ్చే పునాస మామిడి..