యంత్రపరికరాలు

Maize Threshing Machine: మొక్కజొన్న గింజలు వొలుచు యంత్రం గురించి తెలుసుకోండి.!

1
Maize Threshing
Maize Threshing

Maize Threshing Machine: మొక్క జొన్న కండెల నుండి గింజలను వేరుచేయు యంత్రo మొక్క జొన్న తీయు యంత్రం అంటారు.

. ఇందులో రెండు యంత్రాలు కలవు – అవి

· చేతితో త్రిప్పబడు యంత్రo

· యంత్ర సహాయంతో పనిచేసే యంత్రo.

. చేతితో తిప్పబడు యంత్రం

నిర్మాణం:

ఇది 15 సెం.మీ పొడవు కలిగి యుండి మందం గల ఇనుప రేకుతో తయారు చేయబడిన గొట్టము. దీని ద్వారము వద్ద వ్యాస వలెక్కువగా యుండి పోను పోను తక్కువగా ఉంటుంది ఉం టుంది. వీటిలోపల 3 లేక 4 రెక్కలు (రెకులు) బిగించబడి యుండి అరల వలె ఉంటుంది.

పనిచేయు విధానo:

ఈ పరికరాన్ని ఒక చేతితో పట్టుకొని మరొక చేతితో మొక్కజొన్న కండెను వలుస్తారు. దీని యొక్క ముఖద్వారము వద్ద ఉంచి గుండ్రముగా తిప్పాలి. అట్లు తిప్పునప్పుడు గింజలకు మరియు రెక్కలకు మధ్య రాపిడి వలన గింజలు వేరుఅవుతాయి . దీని ద్వారా 150 కిలోల గింజలు వేరు చేయవచ్చు.

Also Read: Maize Cultivation: మొక్కజొన్న సాగులో మెళుకువలు.!

Maize Threshing Machine

Maize Threshing Machine

యంత్ర సహాయంతో పనిచేయు యంత్రo:

ఇందులో భాగాలు:

1. హాపరు

2 సిలిండరు

3. కాన్కోవ్

4. బ్లోయరు

5. జల్లెడలు

6. కప్పీలు

7. మోటరు

8. బెల్టులు

9. ఫ్రేము

నిర్మాణం:

ఈ పై భాగములన్ని ఇనుప చట్రములో అమర్చబడి యుండును. దీని యందు ఉపయోగించు సిలిండరు ఉపరి భాగమున చిన్న చిన్న ముళ్లవంటి పళ్లు ఉండును మోటరు నుండి సిలిండర్లకు బెల్టు సహాయమున యంత్ర శక్తి లభిస్తుంది.

పనిచేసే విధానo: పోస్టరు నుండి మొక్క జొన్న కండెలు వేగముగా తిరుగుతున్న సిలిండర్ పై పడి సిలిండరు మరియు కన్కేప్ల మధ్య ఒత్తబడును. మొక్కజొన్న కండెల మధ్య కలుగు రాపిడి మూలమున గింజలు కండె వేరు చేయబడుతుంది.

. అవిధంగా వేరు చేయబడిన గింజలు మరియు పొట్టు జల్లెడలపై పడుతాయి.

. ఆ విధంగా పడునప్పుడు ప్రక్కగా అమర్చబడిన యర ద్వారా వీచే గాలి ద్వారా పొట్టు మరియు గింజలు లేని కండెలను బయటికి నెట్టబడుతాయి. ఈ విధంగా మంచి గింజలు ఒక జల్లెడపై నుండి తరువాత మిగిలిన పగిలిన గింజలు వేరొక జల్లెడపై నుండి వేరుచేయబడుతాయి.

Also Read: Castor Threshing: ఆముదం కాయలుఎలా వలుస్తారు.!

Leave Your Comments

Sore Mouth in Goats: మేకలలో ఆర్ఫ్ వ్యాధి ఎలా వస్తుంది.! 

Previous article

Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!

Next article

You may also like