యంత్రపరికరాలు

Laser Weeding Robot: గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను తీసేస్తున్న లేజర్ గన్.!

1
Laser Weeding Robot
Laser Weeding Robot Machine

Laser Weeding Robot: వ్యవసాయంలో రైతులకు మొదటి నుండి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా కలుపు సమస్య ప్రధానమైంది. కొన్ని రకాల కలుపు మొక్క జాతులు…వేసిన పంటతో పాటు పోటీపడి మరి పెరుగుతూ, పంట ఎదుగుదలకి అడ్డం పడుతుంటాయి. ఫలితంగా మొక్కలు పోషకాలు గ్రహించడంలో వెనుకపడి, దిగుబడి పూర్తిగా తగ్గిపోతుండడంతో పాటు కలుపు తియ్యడానికి, కూలీలు, కలుపు యంత్రాలకు అదనంగా ఖర్చు, ఆర్ధిక భారం ఏర్పడుతుంది. దానికి తోడు కలుపు నియంత్రణకు మళ్లీ రసాయనాల బాట పట్టాల్సి వస్తుంది. వాతావరణ సమతుల్యతను కోల్పోయి ఎప్పుడు వర్షాలు కురుస్తున్నాయో… ఎప్పుడు ఎండలు వస్తున్నాయో రైతులకు అర్థం కానీ పరిస్థితి… దీని వల్ల పంటలకు చీడ పీడలు మరింత పెరిగే అవకాశం వుంది. అలాంటి కలుపు సమస్యలకు ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతలాగ కలుపుని కలుపుతోనే అరికట్టవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు.. ఒక గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను తీస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లేజర్ కిరణాల కలుపు నివారిణి గురించి మనం ఈరోజు ఏరువాకలో తెలుసుకుందాం…

Also Read: Chilli Nursery Management: మిరప నారును ఏ నెలలో పోసుకుంటే ఆధిక దిగుబడులు వస్తాయి.!

Laser Weeding Robot

Laser Weeding Robot

అద్భుతమైన ఆవిష్కరణ..

రైతులకు ఒక్క మంచి శుభవార్త. ఏమిటి అంటే ఇప్పటి దాక ఎరువులు, విత్తనాలు, రసాయనమందులు, మద్దతుధరలు, యాంత్రీకరణ, కూలీల ఖర్చులు. ఇలా ఎన్నో సమస్యలు… వీటికి తోడు కలుపుసమస్య. రైతుకు ఈసమస్య తలకు మించిన భారంగా మారింది. కలుపు తీయాలి అంటే కూలీల సమస్య, ఖర్చులు, యాంత్రీకరణ వీటిన్నింటికి పరిష్కరం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లేజర్ కిరణాల కలుపు నివారిణి ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఎలాంటి రసాయనాలు లేకుండా లేజర్ గన్ తో కలుపు మొక్కలను మాత్రమే కాల్చివేసి పంట మొక్కలను సురక్షితంగా ఉంచుతుంది. ఒక గంటకు రెండు లక్షల కలుపుమొక్కలను ఒక మిల్లిమీటర్ కంటె తక్కువ ఖచ్చితత్వంతో 99% వరకు నిర్మూలిస్తుంది. పంట ఆరోగ్యాన్ని కాపాడుతూ, నాణ్యతను పెంచి దిగుబడిని పెంచుకుంటుంది.. ఇది పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు పని చేస్తుంది. . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పని తీరు ఎంత అమోఘంగా ఉంది కదూ.

కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

ఈపరికరం అనేది రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కలుపుతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు ఈలేజర్ గన్ ఎంతగానో సహయపడుతుంది. అంతేకాకుండా కూలీల సమస్యతో పాటు శారీరక శ్రమను కూడా తగ్గిస్తుంది..ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా లేజర్ గన్ తో కలువు మొక్కలను మాత్రమే కిరణాలతో కాల్చి వేసి పంటలను సురక్షితంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈగన్ ను అన్ని కాలలలో అన్ని పంటలలో ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆర్ధికభారం తగ్గుతుంది… దీనిని తర్వలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో రైతులకు కొంత శ్రమ తగ్గినట్లే…

Also Read: Trellis Method of Dragon: ట్రెల్లీస్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Leave Your Comments

Trellis Method of Dragon: ట్రెల్లీస్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Previous article

AP Speaker Tammineni Seetharam: పంటకు గరిష్ట మద్దతు ధర అందిస్తున్నది వైసీపీ సర్కార్ లోనే.!

Next article

You may also like