Kubota Tractor: వ్యవసాయ పనులలో ఎద్దులను వాడే రోజుల నుంచి యాంత్రీకరణతో ఎన్నో పరికరాలను వాడే స్థాయికి వచ్చాము. యాంత్రీకరణలో ట్రాక్టర్ , రోతవాటర్ మొదలైనవి వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్నాం. వ్యవసాయ పనులలో ఎక్కువ ఉపయోగించేది ట్రాక్టర్. పొలం దున్నడంతో మొదలై పంటను మార్కెట్కి తీసుకెళ్లే వరకి రైతులు అందరూ ట్రాక్టర్ ఎక్కువగా వాడుతున్నారు. ఆటో కంటే కొంచం పెద్దగా ఉంటుంది ట్రాక్టర్. ట్రాక్టర్ గురుత్వాకర్షణ కేంద్రం (సెంటర్ అఫ్ గ్రావిటీ) వరి పొలంలో దున్నే సమయంలో ట్రాక్షన్ వల్ల మారి రైతుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. రైతులు సులువుగా వాడుకునేల అత్తి చిన్న ట్రాక్టర్‌ని కుబోటా కంపెనీ వాళ్ళు తీసుకొని వచ్చారు.
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో రాష్ట్ర స్థాయి వ్యవసాయ యంత్రాల ప్రదర్శన మేళాలో 100కి పైగా వ్యవసాయ యంత్రాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ప్రపంచంలోనే చిన్న కుబోటా A211N ట్రాక్టర్‌ని ప్రదర్శించడం అందరిని అక్కటుకుంది. కుబోటా ట్రాక్టర్‌ని లిటిల్ మాస్టర్ ట్రాక్టర్ అన్ని పిలుస్తారు. కుబోటా A211N ట్రాక్టర్ 3 అడుగుల ఎత్తు, 2.98 అడుగుల వెడల్పు, 21 HPతో ఉంటుంది. ఈ చిన్న ట్రాక్టర్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
Also Read: Micro Greens: ఇంటిలో పండించుకునే పంటలతో లక్షలు సంపాదించడం ఎలా ?
ఈ చిన్న కుబోటా A211N ట్రాక్టర్ e-TVCS ఇంజన్‌తో వ్యవసాయ పనుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. కుబోటా A211N ట్రాక్టర్ 3 అడుగుల వెడల్పు, 300 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ , 910 మిమీ వెనుక వెడల్పు, 2.1 మిమీ టర్నింగ్ రేడియస్ ఇరుకైన పంట పొలాల్లో కోసం తయారు చేసారు. ఈ ట్రాక్టర్ 4*4 డ్రైవింగ్ సిస్టమ్, ఫోర్ వీల్ డ్రైవ్ కలిగి ఉంటుంది.
ఈ కుబోటా A211N ట్రాక్టర్ తర ట్రాక్టర్‌ల కంటే ఎక్కువ డ్రైవింగ్ స్పేస్ ఉంటుంది. డ్రైవింగ్ స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల రైతులు అలసిపోకుండా వ్యవసాయ పనులు చేసుకుంటారు. ఈ కుబోటా A211N ట్రాక్టర్ వైబ్రేషన్ లేకుండా నడుస్తుంది. కుబోటా A211N ట్రాక్టర్ రోటావేటర్‌తో నడిపిస్తే ఒక లీటర్ డీజిల్, రెండు గంటల వరకు నడపవచ్చు. ఈ కుబోటా A211N ట్రాక్టర్ 9 ఫార్వర్డ్ , 3 రివర్స్ గేర్‌లు, 18.9 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ ట్రాక్టర్ షోరూమ్ ధర 4.90 లక్షలు, న్-రోడ్ ధర 5.5 లక్షలు .
Also Read: PJTSAU: ఘనంగా జరిగిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం.!