Turmeric Digging: తెలంగాణ మొత్తంగా ఎక్కువ శాతంలో పసుపు సాగు నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, అంకాపూర్ గ్రామంలో చేస్తున్నారు. పసుపు పంట పండించడానికి ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ఎద్దులు, నాగలి సహాయంతో పొలం దున్నుతున్నారు. ట్రాక్టర్ ద్వారా పొలాని దున్నుకుంటే పొలంలోని మట్టి అడుగుభాగం గట్టిగ అవుతుంది. దాని వల్ల పసుపు హార్వెస్టింగ్ చేయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతారు. దాని వల్ల ఇప్పటికి ఆ ప్రాంత ప్రజలు పొలం దున్నడానికి ఎద్దులు, నాగలిని వాడుతున్నారు.
వీటి ద్వారా పొలం దున్నడానికి ఇక్కడి ప్రజలకి తక్కువ ఖర్చు అవుతుంది. పసుపు పంట కోతకి రావడానికి సుమారు ఎనిమిది నుంచి తొమిది నెలల సమయం పడుతుంది. ఈ పంట పండించడానికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువ. పసుపు పంట పూర్తి అయ్యాక భూమిలో నుంచి పసుపు తీయడానికి ఎలాంటి మెషిన్ ఉండవు.
భూమిలో నుంచి పసుపు తీయడానికి మెషిన్ వాడితే పసుపు కొమ్ములు విరిపోతాయి. దాని వల్ల దిగుబడిలో నాణ్యత తగ్గుతుంది. భూమిలో నుంచి పసుపు తీయడానికి ఒక ప్రత్యేకమైన పరికరాని వాడుతున్నారు. ఈ పరికరాని ఇక్కడి ప్రజలు కొంకి అని పిలుస్తున్నారు. పసుపు మొక్కల ఆకులు కోసిన తర్వాత పసుపు పంట పొలానికి నీళ్లు పట్టి మట్టిని వదులుగా చేయాలి. ఆ తర్వాత కొంకి అనే పరికరంతో భూమిలో నుంచి పసుపు బయటికి తీస్తారు.
ఈ కొంకిలో ముందు భాగం ఎక్కువ పదును ఉండదు. ఈ పరికరాని వాడి భూమిలో పసుపును తొవ్వి బయటికి తీస్తారు. బయటికి తీసిన పసుపును పిల్ల కొమ్ములు, తల్లి కొమ్ములుగా వేరు చేస్తారు. వీటిని కాది, గోల అని పేర్లతో ఆ ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ కొంకి పరికరం వాడి బయటికి తీసిన పసుపుకి ఎలాంటి దెబ్బలు లేకుండా భూమిలో నుంచి తీయవచ్చు. ఈ పరికరం చాలా తక్కువ ధరకి దొరుకుతుంది.
ఈ పద్ధతులు వాడి పసుపు సాగు చేయడం ద్వారా రైతులకి పంట కోత సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కోతలు కోసుకుంటారు. పసుపు సాగుకి ఎక్కువ పెట్టుబడి ఉన్న కూడా వాటికీ మంచి ఆదాయం వస్తుంది.