Bucket Sprayer: రైతులు పొలానికి ఎరువులు లేదా పురుగుల మందులు చల్లడానికి స్ప్రేయర్స్ వాడేవాళ్లు. చిన్న రైతులు ఈ స్ప్రేయర్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. తక్కువ భూమికి ఇంత ఎక్కువ ఖర్చు చేసి పరికరాలు వాడటం కూడా ఇబ్బంది. ప్రస్తుతం వాడే స్ప్రేయర్స్ రైతులు భుజాలపై వేసుకొని పిచికారీ చేసుకోవాలి. వాటి వల్ల రైతులకి చాలా శ్రమ పెరుగుతుంది. చిన్న రైతులకి హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ అనే పరికరం ఉంది. ఈ పరికరాని మోటార్ స్ప్రేయర్స్ వచ్చాక పెద్దగా వాడటం లేదు.
హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ వాడటం చాలా సులువు. ఈ స్ప్రయ్ర్కి ఒక ఫుట్ వాల్వ్ ఉంటుంది. ఈ ఫుట్ వాల్వ్ నీళ్లు, పురుగుల మందులు కలిపిన బకెట్లో వేయాలి. ఈ ఫుట్ వాల్వ్కి ఒక పైప్ అటాచ్ చేసుకొని ఉంటుంది. దాని స్ప్రేయర్ హ్యాండ్లేకి కనెక్ట్ చేస్తారు. ఈ స్ప్రేయర్ హేండిల్ ముందుకి వెనక్కి తోయడం వల్ల ప్రెషర్ ద్వారా పిచికారీ అవుతుంది.
Also Read: Farm Embankment: ఇలా చేయడం వల్ల పొలం గట్టు ఎక్కువగా దున్నకుండా ఉంటారు..
ఈ హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ మిద్దె తోటలకి, ఒక ఎకరం , లేదా పెరటి తోటలకి చాలా ఉపయోగపడుతది. మిద్దె తోటలకి పురుగుల మందులు స్ప్రే చేయడం ఈ పరికరంతో చాలా సులువుగా అవుతుంది.
ఈ పరికరాని గుంటూరు జిల్లా , మంగళగిరిలో శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఈ పరికరం కేవలం 650 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ కావాలి అనుకున్న రైతులు 7075062968 ఈ నెంబర్ సంప్రదించగలరు.
Also Read: Mulberry Fruits: ఈ పండ్లు సాగు చేస్తే 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చు..