Drone Technology In Agriculture: వ్యవసాయంలో రోజు రోజుకి అనేక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ పద్దతిలో పంటలు పండించడం నుంచి వ్యవసాయంలో యాంత్రీకరణ వాడుతున్నాము. ఇప్పటికి దాకా వ్యవసాయంలో యాంత్రీకరణ అంటే ట్రాక్టర్లు, స్ప్రేలు, దుక్కి దున్నడానికి పరికరాలు, వరి కోయడానికి హార్వెస్టర్స్, వేరుశనగకి డెకారుడికేటర్, ఇలా ఎన్నో యంత్రాలు వచ్చి రైతులకి వ్యవసాయం చేయడానికి సులువు మార్గాలు తీసుకొని వస్తున్నాయి. ఇలా వచ్చిన యాంత్రికరణలో ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నాయి.
డ్రోన్స్ ద్వారా విత్తనాలు నాటడం నుంచి ఎరువులు చల్లడానికి వరకు వాడుకోవచ్చు. అని రాష్ట్రలో డ్రోన్స్ రైతులకి అందుబాటులో ఉండాలి అని ప్రభుత్వం ఆదేశించడంతో 1000 ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలలో అందుబాటులోకి వచ్చాయీ. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల నుంచి రైతుకి డ్రోన్స్ అద్దెకి ఇస్తున్నారు. ఈ సేవ కేంద్రాల నుంచి డ్రోన్స్ కొనుకోవచ్చు. డ్రోన్స్ కొన్నాడానికి బ్యాంక్స్ రుణాలు ఇస్తున్నాయి దానితో పాటు ప్రభుత్వం సబ్సిడీ కూడా రైతులకి అందిస్తుంది.
Also Read: Koonaram Agriculture College: పెద్దపెల్లి జిల్లా కూనారంలో వ్యవసాయ కళాశాలకు సీఎం కేసీఆర్ ఆమోదం
డ్రోన్స్ ఆపరేట్ చెయ్యడానికి వారికి శిక్షణ, లైసెన్స్ ఇవ్వడానికి ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఒక డ్రోన్ ఖరీదు 10 లక్షల దాకా ఉంటుంది. ఈ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల నుంచి సబ్సిడీతో తీసుకోవచ్చు. లేకపోతే కొంత మంది రైతులు కలిసి ఒక గ్రూపుగా కూడా ఈ డ్రోన్స్ కొనుకోవచ్చు. ఇలా తీసుకొని వేరే రైతుల పొలంలో వాడుకోవడానికి రెంట్గా ఇచ్చి కూడా ఆదాయం చేసుకోవచ్చు.
రైతులు పురుగుల మందులు చల్లి అనారోగ్యానికి గురి అవుతారు. ఈ డ్రోన్స్ వాడితే మొక్కలకి సరైన మోతాదులో మందులు, ఎరువులు చెల్లుతుంది. మొక్కల పై భాగంలో వేసే ఎరువులు ఉన్నాయి, మొక్కల వేర్ల దగర వేసే ఎరువులు ఉన్నాయి. వాటికీ అనువుగా మార్చుకోవడానికి డ్రోన్కి కొన్ని విడి భాగాలని అమర్చుకోవాలి. ఎరువులు లేదా మందులు వేసే అప్పుడు నీళ్లు, పురుగుల మందులు వృధా అవ్వవు. స్ప్రేయింగ్ కూడా సమానంగా స్ప్రే చేస్తుంది. డ్రోన్స్ వాడటం వల్ల విత్తనాలు సరైన లోతులో, పొలంలో సమానంగా వేస్తుంది. విత్తనాలు వృధా కాకుండా ఉంటాయి.
పంటలో ఎలాంటి పురుగులు ఉంటే వాటిని ఫోటో తెస్తుంది. దాని వల్ల ఆ పురుగుల తగిన పురుగుల మందులు వాడుకోవచ్చు. పంట దిగుబడి ఎంత వస్తుంది, వాటి గురించి మొత్తం నమోదు చేసి రైతులకి ఇస్తుంది. ఈ డ్రోన్స్ వాడడం వల్ల రైతులకి సమాయంతో పాటు ఖర్చు కూడా తగ్గించు కోవచ్చు.
Also Read: Koonaram Agriculture College: పెద్దపెల్లి జిల్లా కూనారంలో వ్యవసాయ కళాశాలకు సీఎం కేసీఆర్ ఆమోదం