Auto Roll Tractor Mounted Sprayer: రైతులు వాళ్ళు పండించిన పంటలకు ఎరువులు, పరుగుల మందులు పిచికారీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటలకు పరుగుల మందులు పిచుకరీ చేయడానికి దాదాపు 20 లీటర్ల స్ప్రయ్ర్ని బుజాల పై వేసుకొని పొలం మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఆ 20 లీటర్లు అయిపోయాక మిగిలిన పొలానికి పిచుకరీ చేయడానికి మల్లి స్ప్రేయర్ని నింపుకొని పొలానికి పిచుకరీ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సమయం వృధా అవుతుంది.
రైతులకి శ్రమ ఎక్కువ అవుతుంది, ఎరువులు, పురుగుల మందులు కూడా వృధా అవుతున్నాయి. రైతుల శ్రమ, సమయం తగ్గించడానికి ట్రాక్టర్ సహాయంతో స్ప్రేయర్ని మౌంటింగ్ చేసుకొని పొలం మొత్తం ఒకే సారి పిచుకరీ చేసుకోవచ్చు. ఈ పరికరం పేరు ఆటో రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్.
ఈ ఆటో రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్తో సుమారు 20-30 ఎకరాల పొలం ఒకేసారి పిచుకరీ చేసుకోవచ్చ. ట్రాక్టర్కి 1000-1500 లీటర్ల కెపాసిటీ ఉండే నీళ్ల ట్యాంక్ పరికరాని మౌంట్ చేసుకొని. ఆ ట్యాంక్లో మన పోలంకి కావాల్సిన మందులు, ఎరువులు, నీళ్లు కలుపుకోవాలి. ఈ పరికరానికి 300 మీటర్ల పైప్, పంప్, ట్యాంక్కి కనెక్ట్ ఉంటుంది.
Also Read: Sabji Kothi: పండ్లని, కూరగాయాలని స్టోర్ చేసుకోడానికి కొత్త పరికరం.!

Auto Roll Tractor Mounted Sprayer
పైప్ ఇంకో వైపు స్ప్రేయర్ నోజ్ల్ కనెక్ట్ ఉంటుంది. స్ప్రేయర్ నోజ్ల్ విడ్త్ పంట పొలాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ స్ప్రేయర్ నోజ్ల్ హేండిల్ చేతిలో పట్టుకొని పొలం మొత్తం తిరుగుతూ పిచుకరీ చేసుకోవచ్చు. మనం నడిచే దూరని బట్టి పైప్ పొడువు ఆటోమేటిక్ పెరుగుతుంది. పైప్ పొడువుని తగ్గించడానికి ఈ పరికరం దగ్గర ఒక పెడిల్ ఉంటుంది, దాని కాలితో నొక్కడం ద్వారా పైప్ ఆటోమేటిక్ రోల్ అవుతుంది.
ఒకసారి ఈ ట్యాంక్ని పింపుకొని పొలం మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. ఈ పరికరం మార్కెట్లో 65000 రూపాయలకి దొరుకుతుంది. ఈ పరికరాని వాడుకోవడం వల్ల దాదాపు 20-30 ఎకరాల పొలం 20-30 నిమిషాల్లో పిచుకరి చేసుకోవచ్చు. ఈ ఆటో రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ద్వారా పత్తి, మిరప, కంది, మొదలైన అని పంటలకి పిచుకరీ చేసుకోవచ్చు.
ఈ పరికరం వాడటం వాళ్ళ రైతులకి శ్రమ, సమయం వృధా కాకుండా, ఎరువులు సమానంగా స్ప్రే అవ్వడం వల్ల, ఎరువులు, పురుగుల మందులు వృధా కూడా తగ్గుతుంది. ఈ ఆటో రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ట్రాక్టర్తో నడపడం ద్వారా పొలంలో రైతులు తిరిగే సమయం కూడా తగ్గుతుంది.
Also Read: Soil Fertility: నేల సారం పెంచడం ఎలా.?