Portable Solar Pump: చిన్న చిన్న రైతులు పోలంకి నీళ్లు అందించాలి అంటే పెద్ద పెద్ద మోటార్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరెంటు ద్వారా నడిచే మోటార్కి కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. పెట్రోల్ వాడాలి అనుకున్న కూడా పెట్రోల్ ధర లీటర్ 100 రూపాయల పైనే ఉంది. ప్రభుత్వం కూడా రైతులకి మోటార్లు ఇస్తుంది. కానీ అందరికి ఆ మోటార్ల రావడం లేదు. చిన్న చిన్న పొలం పనులు చేయడానికి పెద్ద మోటార్ల వాడలేము. ఈ రైతు సమస్యలు అని గమనించి ఫార్మ్ ఈజీ కంపెనీ, గౌతమ్ గారు పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంప్ తయారు చేశారు.
ఈ పంప్ సూర్య కాంతితో పని చేస్తుంది. సోలార్ కార్ట్ ఎక్కడికైనా సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు. ఈ కార్ట్కి రెండు చక్రాలు ఉన్నాయి. దాని వల్ల ఏ ప్రాంతానికి అయిన సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు. ఈ పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంప్ 0.5 హెచ్.పి, 1 హెచ్.పి, 2 హెచ్.పిలో ఉన్నాయి.
Also Read: Minister Niranjan Reddy: తెలంగాణలో ఆశాజనకంగా వ్యవసాయం..
ఈ పంప్ ద్వారా కాలువలు, ఫార్మ్ పాండ్, చెరువుల నుంచి నీటిని బయటికి తీసుకోవచ్చు. ఈ పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంప్ని కూరగాయలు సాగులో, కొబారి తోట డ్రిప్ ద్వారా సాగు చేసే రైతులు వాడుకోవచ్చు. ఈ పంప్ డిసి పంప్ కాబట్టి బాటరీ వాడాల్సిన అవసరం లేదు. 0.5 హెచ్.పి పంప్ వాడి 20 ఫీట్ వరకు నీళ్లను బయటికి తీయవచ్చు. ఈ పోర్టబుల్ సోలార్ కార్ట్ బోర్ వాటర్కి వాడలేము.
ఈ పంప్ ఫార్మ్ మోటర్గా వాడలేము. సోలార్ ప్యానెల్ ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల ఎక్కువ రోజులు వస్తుంది. ఈ సోలార్ ప్యానెల్ గ్లాస్, ఫైబర్ రెండు రూపంలో ఉంటుంది. గ్లాస్ సోలార్ ప్యానెల్కి 25 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. ఫైబర్ సోలార్ ప్యానెల్కి 10 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. పంప్ ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది. బాటరీ లేకుండా పంప్ జాక్ ప్యానెల్ జాక్ కనెక్ట్ చేసుకొని నీటిని పొలానికి వాడుకోవచ్చు. ఒక గంటకి 5000-6000 లీటర్లు విడుదల చేయవచ్చు. 0.5 హెచ్.పి పోర్టబుల్ సోలార్ కార్ట్ విత్ అగ్రికల్చర్ పంప్ 60-70 వేల రూపాయల ఖర్చు అవుతుంది. రైతులు కొనుగోలు చేసుకొని ఇతర రైతులకి రెంట్ ఇచ్చి ఆదాయం చేసుకోవచ్చు.
Also Read: Custard Apple Varieties: సరి కొత్త రకం సీతాఫలంతో మంచి లాభాలు..