Brush Cutter: పొలంలో వచ్చే కలుపు తీయడానికి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. కలుపు నివారణకు ఎన్నో మందులు ఉన్నాయి. ఈ మందుల వల్ల తాత్కలికంగానే కలుపు పోతుంది. మళ్ళీ కొన్ని రోజులకి కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. కలుపు మొక్కలు తీయడానికి బ్రష్ కట్టర్ పరికరం వచ్చింది. ఈ బ్రష్ కట్టర్ వల్ల కలుపు మొక్కలు తీయడం రైతులకి సులువు అవ్వుతుంది.
ఈ బ్రష్ కట్టర్ కలుపు మొక్కలని కట్ చేయదని మాత్రమే కాదు. దీనితో పశువుల కోసం గడ్డి, వరి పంటని కోయవచ్చు. పండ్ల తోటలో కొమ్మలని, కలుపు మొక్కలని, కూరగాయల పొలంలో సెకండరీ తిల్లాగేల ధునుకోవచ్చు. బ్రష్ కట్టర్లో మూడు రకాల బ్లెడ్స్ ఉంటాయి.
మొదటిది టిలర్ లేదా వీడర్ బ్లేడ్ అంటారు. ఈ బ్లేడ్ కి 80 పళ్ళు ఉంటాయి. 10 ఇంచెస్ డైమీటర్ ఉంటుంది. ఈ బ్రష్ కట్టర్ వీడర్ బ్లేడ్ వరి పంటని, పశువుల కోసం గడ్డిని కోసుకోవచ్చు. ఈ బ్లేడ్ నేలకి, రాళ్ళకి తగలకుండా వాడుకోవాలి. గడ్డిని కోసే అప్పుడు 1-2 ఇంచెస్ నేల నుంచి పైకి కోయాలి. ఈ బ్లేడ్ వాడే స్థలంలో పైప్స్, డ్రిప్ పైప్ లేకుండా చేసుకోవాలి. లేకపోతే పైప్ కూడా కట్ అయిపోతాయి. ఈ బ్లేడ్ ఎడుమ వైపు మాత్రమే కట్ చేస్తుంది.
Also Read: Jasmine Farming:ఈ పువ్వుల తోటతో మంచి లాభాలు..

Brush Cutter
ఈ బ్రష్ కట్టర్ వీడర్ బ్లేడ్తో పాటు ఒక సీయిల్డ్ కూడా వస్తుంది. దీనిని వాడి వారి పంట కొస్తే బ్లేడ్కి అమీ కాకుండా ఉంటుంది. చాలా సన్నగా ఉన్న పంటలకి ఈ బ్రష్ కట్టర్ వీడర్ బ్లేడ్ సీయిల్డ్ వాడుతారు.
ఇంకో బ్లేడ్ కూడా ఈ బ్లేడ్ లాగానే పనిచేస్తుంది. కానీ ఈ బ్లేడ్ కి 3 పళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ బ్లేడ్ నేలకి, రాళ్ళకి తగిలిన ఏమి కాదు. ఈ బ్లేడ్ రెండు వైపులు గడ్డిని కట్ చేస్తుంది.
నైలాన్ ట్రిమ్ర్ ద్వారా చిన్న చిన్న గడ్డి, పార్కింగ్ గడ్డిని కట్ చేసుకోవచ్చు. టిల్లర్ బ్లేడ్ ద్వారా పొలమని సెకండరీ పోలుగింగ్గా దున్నుకోవచ్చు. నేల గట్టిగా ఉన్న, రాళ్ళూ ఉన్న కూడా బ్లేడ్ ఏమి కాదు. దీని ద్వారా పండ్ల తోటలో కలుపు తీయడానికి, కూరగాయల తోటలో కలుపు తీయడానికి వాడుతారు. టిల్లెర్ వీడర్ మెత్తటి పొలంలో మాత్రమే కలుపు తీయడానికి వాడుతారు .
ఈ బ్రష్ కట్టర్ 2,4 స్ట్రోక్ దొరుకుతున్నాయి, ఇంజిన్ 52 సిసి ఉంటుంది. ఈ బ్రష్ కట్టర్ గంటన్నర వరకు కలుపు తీసుకోవచ్చు. ఇందులో నూనె తో పాటు పెట్రోల్ పోసి నడుపుకోవాలి. ఈ పరికరాని వాడుకోవడం వల్ల రైతులు వారి పొలంలో కలుపు , పంట కోతలని సులువుగా వాళ్లే చేసుకోవచ్చు.
Also Read: Indian Oats Farming: ఈ కొత్త రకం పంటలో పాల కంటే 10 రేట్లు ఎక్కువ పోషక గుణాలు.!