3 Rows Ridger: ట్రాక్టర్తో నడిపే నాగలి ఎక్కువగా పొలం దునుకోవడానికి, కలుపు మొక్కలు దున్నడానికి వాడుతారు. నాగలి ద్వారా పొలం దున్నితే మట్టి తొందరగా మెత్తపడిపోతుంది. గట్టి నెలలో నాగలిని వాడుతారు. నాగలితో దున్నిన పొలంలో ఏ పంటలు అయిన వేసుకోవచ్చు. మనం సాధారణంగా చూసిన నాగలికి రెండు వరుసలకి మాత్రమే టైన్ ఉంటాయి. ఈ నాగలితో పొలం దునే సమయంలో టైన్ మధ్యలో మట్టి ఇరుకపోవడం జరుగుతుంది.
మట్టి ఇరుకపోవడం ఒక సమస్య అయితే , ఇంకోటి నాగలితో దున్న సమయంలో నాగలి భూమి లోపలి ఎక్కువగా వెళ్తుంది. దున్నే ప్రతి సారి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా మళ్ళీ నాగలి పైకి అనుకుంటూ పొలం దున్నాలి. ఇలా ప్రతి సారి చేయడం రైతులకి చాలా ఇబ్బంది. మట్టి ఇరుకుంటే తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.
Also Read: Carrot Cultivation: క్యారెట్ పంట ఎలా సాగు చేయాలి..?
ఈ సమస్యకి పరిష్కారంగా రైతులు రెండు వరుసల నాగలిని మధ్య భాగంలో ఒక అంగుళర్ వేసి మూడు వరుసల నాగలిని తయారు చేసుకున్నారు. ఈ అంగుళర్కి, రెండు వరుసల మధ్యలో నాగేంలని పెట్టుకున్నారు. ఈ మూడు వరుసలు వాడటం ద్వారా రైతులు పొలం దున్నే సమయంలో నాగలి మధ్యలో మట్టి ఇరుక్కుపోవడం ఉండదు.

3 Rows Ridger
దున్నే సమయంలో మట్టిలోపాటికి ఎక్కువ కూడా వెళ్ళదు. ఒకేసారి మూడు వరుసల నాగలితో దున్నుకోవడం వల్ల సమయం కూడా తగ్గుతుంది. ఈ నాగలికి మొత్తం 10 బ్లెడ్స్ ఉంటాయి. ఎక్కువ బ్లెడ్స్ ఉండటం వల్ల మిర్చి, పత్తి పంటలో కలుపు కోసం లేదా దున్నడానికి ఎక్కువగా వాడుతున్నారు.
సళ్ళ మధ్య తక్కువ దూరం ఉన్న కూడా ఈ నాగలితో సులువుగా దున్నుకోవచ్చు. ఈ నాగలి వాడితే 10 సళ్ళు ఒకేసారి దున్నుకోవచ్చు. దాని వల్ల కలుపు కూడా సులభంగా వచ్చేస్తుంది. రైతుల దగరలో ఉన్న వెల్డడింగ్ వల్ల నుంచి ఇలా నాగలి తయారు చేసుకోవచ్చు.