Hand Held Ridger: సాధారణం విత్తనాలను చేతితో నాటుతారు.ఇందులో ఆడవారు ఎక్కువ. వంగి నాటడం వలన నడుము ముక్కలు అవడం సహజం.సాళ్లు తయారు చేయడం పంట పండించడంలో ఒక ఆంగిక భాగం. గట్ల పైన కూరగాయలు విత్తడానికి పొలంలో గట్లును తవ్వాల్సి వస్తుంది.వీటిని తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని కానీ ఇపుడు గేట్లను తయారు చేయడం అత్యంత సులభతరం. దీనికోసం CIAE, భోపాల్- NRCWA సబ్ సెంటర్ వారు వ్యయ ప్రయాసలు ఓడ్చి మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో హ్యాండ్ రిడ్జర్ తయారు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ పరికరం నీటిపారుదల కోసం పొలాలలో సాళ్లను తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
హ్యాండ్ రిడ్జర్ యొక్క సంక్షిప్త వివరణ : రిడ్జ్‌లు తయారు చేయడానికి మాన్యువల్‌గా(చేతితో ) పనిచేసే హ్యాండ్ రిడ్జర్ ను అభివృద్ధి చేసారు. ఇది T-టైప్ హ్యాండిల్‌తో బిగించబడి రిడ్జర్ మరియు పుల్లింగ్ బీమ్ అనుసంధాన్ని కలిగి ఉంటుంది. గట్లు/సాళ్లను ఈ యంత్రంతో తయారు చేయడానికి పొలాన్ని బాగా సిద్ధం చేయాలి.ఇలా చేయడం వలన పరికరాల మెరుగైన పనితీరును పొందవచ్చు.ఈ పరికరాన్నీ కేవలం ఇద్దరు మహిళా కార్మికులు నడుపవచ్చు.
Also Read: తక్కువ శ్రమతో ఎక్కువ పని
దీనిని ఒకరు లాగడానికి, మరొకరు నెట్టడానికి మరియు గైడ్ చేయడానికి సరిపోతారు. చాలా త్వరితగతిన మహిళలు శ్రమ లేకుండా గేట్లను లేదా సాళ్ళను ఏర్పరచవచ్చు. దీని సామర్థ్యం: 330 m2 / h. సాంప్రదాయ పద్ధతిలో పొలంలో రిడ్జ్‌లను తయారు చేయడంతో పోలిస్తే రిడ్జర్‌తో కార్మికుడి శక్తిలో దాదాపు 67% ఆదా అవుతుందని అంచనా.ఇది ప్రతిదానికి వంగే అవసరం లేకుండా చూస్తుంది.సాంప్రదాయ పద్దతికన్నా ఈ పరికరంతో రైతు ఉత్పాదకత రెట్టింపు అవుతుంది.దీని వలన వచ్చే ఖర్చు రూ. 700/-. దీనిని అభివృద్ధి చేసింది CIAE, భోపాల్- NRCWA సబ్ సెంటర్. ప్రస్తుతం ఈ యంత్రం CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038 వారి దగ్గర లభ్యమవును. రైతులు CIAE వారిని ప్రత్యేక్షంగా లేదా వెబ్సైటు ద్వారా సంప్రదించవచ్చు.
Also Read: విత్తన శుద్ధి కోసం విప్లవాత్మక సీడ్ ట్రీట్మెంట్ డ్రమ్