యంత్రపరికరాలు

రైతుల కోసం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు…

0
Electric Tractor

Government Will Soon Launch an Electric Tractor ఇంధన వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోల్, డీజీల్ వాహనాల రిజిస్ట్రేషన్ లను తగ్గించేసింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ప్రోత్సహిస్తూ ప్రజలకు చేరవేస్తుంది. పర్యావరణాన్ని కాపాడటం, సామాన్యులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రూపకల్పన చేస్తుంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది కేంద్రం. Nitin Gadkari

Electric Tractor

రాబోయే రోజుల్లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి బ్యాటరీ-ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను విడుదల చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్‌కు రవాణా చేయవచ్చని గడ్కరీ చెప్పారు. ఒక రైతు 300 కిలోల కూరగాయలను మార్కెట్‌కు పంపిణీ చేయవలసి వస్తే, అతను సగటున రూ. 200 చెల్లించాలి. దీంతో రైతుపై తీవ్ర భారం పడుతున్న నేపథ్యంలో అతి త్వరలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

Electric Tractor

దేశంలోని అనేక ప్రాంతాల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 100 దాటడంతో, వ్యవసాయ ఉత్పత్తుల ధర కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను ఉపయోగించడం వల్ల రైతుకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని అయన అభిప్రాయం పడ్డారు.Electric Tractor For Farmers

Leave Your Comments

భవిష్యత్తులో సూక్ష్మ సేద్యంతోనే వరిసాగు

Previous article

వ్యవసాయ సాంకేతికత సదస్సులో ఏపీ మంత్రి కన్నబాబు

Next article

You may also like