Electric Issurrai: రైతులు పంటలు పండించక పూర్వం వీటిని ఆహారంగా తిన్నాడనికి ఇంటిలోనే ప్రాసెస్ చేసే వాళ్ళు. ఈ ప్రొసెస్సింగ్కి ఇసుర్రాయి వాడే వాళ్ళు. బియ్యం పై పొట్టు తీయడానికి, పప్పుల ఫై పొట్టు తీయడానికి ఇంటిలో వాడిదే వాళ్ళు. లేదా ఇతర గింజలని పిండి, రవ్వలా తయారు చేయడానికి వాడుతారు. ఇసుర్రాయి వాడి వీటిని తయారు చేయడం తిన్నడం కూడా ఆరోగ్యానికి మంచిది. కానీ ఇసుర్రాయి వాడటం చాలా కష్టం, శ్రమతో కూడిన పని. ఇప్పుడు ఈ ఇసుర్రాయి కూడా సులువుగా వాడటానికి మహబూబ్నగర్ జిల్లాలో, హన్వాడ గ్రామంలో ఎలక్ట్రిక్ ఇసుర్రాయి కేంద్రం ఏర్పాటు చేశారు.
మనం పూర్వము వాడే పద్దతిలోనే ఈ ఎలక్ట్రిక్ ఇసుర్రాయి కూడా పని చేస్తుంది. ఎలక్ట్రిక్ పద్దతిలో వాడటం వల్ల శ్రమ తగ్గింది. వీటిని పండి. రవ. పప్పు చేయడానికి వాడుతారు. దీని ద్వారా తయారు చేసిన పదార్థాలు వృధా అవకుండా ఉంటాయి. తక్కువ శాతంలో పప్పు రవగా మారడం ఉంటుంది దాని వల్ల పప్పు పై పొట్టు తీసే సమయంలో ఎక్కువ పప్పు రవగా మారకుండా పప్పుగానే వస్తుంది.
Also Read: Mic for Protect Crops from Birds: రైతులు పంటని పక్షుల నుంచి కాపాడుకోవడానికి కొత్త పరికరం..

Electric Issurrai
ఈ ఎలక్ట్రిక్ ఇసుర్రాయి ద్వారా గంటకి 5 కేజీల పిండి, 7-8 కేజీల రవ, 15 కేజీల వరకు పప్పు తయారు చేసుకోవచ్చు. దీనిలో అన్ని రకాల గింజలు వేసుకోవచ్చు. సములు, జొన్నలు, గోధుమలు, చిరు ధాన్యాలు ఏవైనా వేసుకొని రవ లేదా పిండి చేసుకోవచ్చు. ఈ ఒక పరికరం కొన్నాడానికి 45 వేలు ఖర్చు అవుతుంది.
అందరూ పాత పద్ధతులు మళ్ళీ వాడటం మొదలు పెట్టక వీటికి మంచి డిమాండ్ ఉంది. దీని ద్వారా ఆదాయం కూడా మంచిగానే వస్తుంది. పాత పద్ధతులు వాడటం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: Roto Puddler: వరి పండించే రైతుల కోసం కొత్త యంత్రం.!