యంత్రపరికరాలు

Different Types Tractors: వివిధ రకముల ట్రాక్టర్లు

1
Different Types of Tractors
Different Types of Tractors

Different Types Tractors: వ్యవసాయ పరికరములను తగిలించుకొని వాటిని వేగముగా లాగుటకు, ఒక చోట నుండి మరియొక చోటుకు రవాణా చేయుటకు మరియు వ్యవసాయ పనులను త్వరితంగా చేయుటకు ట్రాక్టరు ఉపయోగపడుతుంది.

రెండు చక్రముల గల ట్రాక్టర్లు:-
వీటిని చిన్న చిన్న పోలలోను, తక్కువ విస్తీర్ణ సాగులోనూ మరియు తోట పనులకు ఎక్కువ ఉపయోగిస్తారు.

మూడు చక్రముల గల ట్రాక్టర్లు:-
వీటి యందు ట్రాక్టరు ముందు భాగమున మధ్యగా ఒకటి లేదా ఒకదాని ప్రక్కగా మరియొకటిగా అమర్చిన రెండు చక్రములనుండి వెనుక భాగమున రెండు వైపుల రెండు చక్రాములుంటాయి. చిన్న మలుపులలో గూడ ఈ ట్రాక్టర్లను త్వరగా త్రిప్పుకొనవచ్చును. ఈ ట్రాక్టర్లు ఇప్పుడు ఎక్కువగా వాడుకలో లేవు.

నాలుగు చక్రముల గల ట్రాక్టర్లు:-
ఇవి అన్ని వ్యవసాయ పనులకు విరివిగా ఉపయోగపడును. ఈ ట్రాక్టర్లు ముందు వైపు రెండు ప్రక్కల రెండు చక్రములు మరియు వెనుక వైపు రెండు ప్రక్కల రెండు చక్రములను కలిగి ఉంటాయి.
ఈ ట్రాక్టర్లు వాటిని ఉపయోగించు ప్రదేశమును బట్టి ఈ క్రింది విధముగా విభజింప బడినవి.
కర్మాగారములలో ఉపయోగించు ట్రాక్టర్లు
వ్యవసాయ పనులకు ఉపయోగించు ట్రాక్టర్లు

Also Read: Eicher Tractors: రైతుల కోసం విడుదల చేసిన ప్రీమియం ట్రాక్టర్ Prima G3 ప్రత్యేకతలు

కర్మాగారములలో ఉపయోగించు ట్రాక్టర్లు:-
ఇవి సాధారణముగా కర్మాగారములలో బరువులను ఒకచోట ఉండి మరియొక చోటికి తీసుకోనిపోవుటకు, మరియు బరువులను ఎత్తుటకు ఉపయోగపడును.
సాళ్లలో ఉపయోగించుకోను ట్రాక్టర్లు
పండ్లతోటలలో ఉపయోగించుకోను ట్రాక్టర్లు
సాధారణ ట్రాక్టర్లు

Different Types Tractors

Different Types Tractors

సాళ్లలో ఉపయోగించుకోను ట్రాక్టర్లు:-
ఇది అన్ని వ్యవసాయ పనులను చేయుటకు ఉపయోగపడును. అనగా ప్రాధమిక దశలో దుక్కి దున్నుటకు, చదువు చేయుట , దమ్ముచేయుట మరియు కలుపు తీయుట మొదలగు పనులన్నీయు చేసుకొనవచ్చును. అంతేకాక ఇతర వ్యవసాయ పరికరములను నడుపుటకు కూడా ఉపయోగపడును.
ఉపయోగాలు:- సాళ్లలో పండించు అన్ని పంటలకు ఉపయోగపడును. పంట రకమును బట్టి ముందు చక్రముల మధ్య దూరం మార్చుకొను విలుగలదు. చిన్న మలుపులలో కూడా త్వరగా మరియు సులభముగా త్రిప్పుకొను వీలు గలదు. వ్యవసాయ పరికరములను పైకి లేపుటకు మరియు పొలములో దింపుటకు వీలుగా హైడ్రాలిక్ అమర్చబడి ఉండును.

పండ్లతోటలలో ఉపయోగించుకోను ట్రాక్టర్లు:- ఇవి పండ్ల తోటలలో పనిచేయుటకు అనువుగా తయారు చేయబడి ఉంటాయి. తక్కువ ఎత్తు, తక్కువ వెడల్పు మరియు చిన్న చక్రమును కలిగి యుండి అన్ని రకముల పండ్ల తోటలలో పనిచేయుటకు అనువుగా తయారు చేయబడి ఉండును ఇందులో ముఖ్యముగా ఇతర ట్రాక్టరులలో మాదిరిగా పైకి పొడుచుకొనువచ్చు భాగములు ఉండువు.

సాధారణ ట్రాక్టర్లు:- ఇవి అన్ని వ్యవసాయ పనులు చేయుటకు మరియు బరువులను ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు తీసుకొని పోవుటకు అనువుగా నిర్మించబడి ఉంటాయి. పొలంలో ప్రాధమిక దశలో దుక్కి దున్నుటకు, ద్వితీయ దశలో దుక్కి దున్నుటకు విత్తనములను వేయుటకు , కోతలు కోయుటకు, మరియు ఇతర వ్యవసాయ పనులు చేయుటకుపయోగపడును. మరియు బరువులను ట్రాలీలలో రోడ్ల మీద వేగముగా మోసుకొనిపోగలవు. ఇవి సాధారణముగా నాలుగు చక్రములను కలిగి ఉంటాయి. మన దేశములో తయారయ్యే అధిక శాతం ట్రాక్టర్లు ఈ రకమునకు చెందినవే.
వ్యవసాయ పనులకు ఉపయోగించు ట్రాక్టర్లు

ట్రాక్ లేదా చైన్ లతో నడుచు ట్రాక్టర్లు:-
ఈ ట్రాక్టర్లయందు చక్రములకు బదులుగ ట్రాక్టరుకు రెండువైపుల పెద్ద పెద్ద చెయిన్ లు అమర్చబడి ఉంటాయి. ఈ చెయిన్ నే ట్రాక్ అని అంటారు. గుండ్రముగా తిరిగేడి ట్రాక్టరు వెనుక ఇరుసు పై అమర్చిన పండ్ల చక్రముల వలన ఈ ట్రాక్ కదులుతూ ట్రాక్టరును ముందుకు నడిపిస్తుంది.

Also Read: PM Kisan Tractor Yojana: వ్యవసాయ ట్రాక్టర్ పై లక్ష సబ్సిడీ

Leave Your Comments

Jammu Grass Cultivation: జమ్ము గడ్డి

Previous article

Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo

Next article

You may also like