Solar Dryers: ధాన్యం తూర్పారబట్టే యంత్రం – సౌరశక్తితో పనిచేసే వరి ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రం (విన్నోయర్)ను బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అభివృద్ధి చేశారు. దీనితో గంటకు 175-225 కిలోల ధాన్యాన్ని తూర్పార పట్టవచ్చు. ధాన్యంలోని దుమ్ము, ధూళి, తప్ప, తాలు, గడ్డి లాంటి తక్కువ సాంద్రత గల పదార్థాలు గాలితో పాటు బయటకు పోతాయి. ఈ యంత్రంలో 0.25 హెచ్.పి. మోటారు 150 వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానెల్తో అనుసంధానం చేసి ఉంటుంది. ఈ ప్యానెల్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది.
సోలార్ గ్రీన్ డ్రైయర్: తక్కువ ఖర్చుతో సూర్యర శ్మిలో పనిచేసే ఈ డ్రైయర్లో ఒక టన్ను ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. బయటకన్నా ఇందులో 10-15 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. రెండు, రెండున్నర రోజుల్లో ధాన్యంలోని తేమను 25 శాతం నుంచి 12 శాతానికి తగ్గించవచ్చు.దీనిలో ఆరబెట్టిన ధాన్యం ఎక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. మరపట్టించినప్పుడు నూక శాతం తగ్గి, బియ్యం దిగు బడి పెరుగుతుందని బాపట్లలో గుర్తించారు.
Also Read: Flower Farming: సకాలంలో పూల ఉత్పత్తి ఎలా చెయ్యాలి.!
ఈ యంత్రం ధర సుమారు రూ. 2 లక్షల దాకా సోలార్ పరికరం తయారు చేశాడు. సోలార్ స్ప్రేయర్: పైర్లపై సస్యరక్షణ రసాయ నాలు పిచికారి చేసేందుకు దీన్ని వాడతారు.. బరువు తక్కువగా ఉంటుంది. సోలార్, విద్యుత్తు రెండింటితో రీచార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి రీచార్జ్ చేస్తే అయిదారు గంటలపాటు పిచికారి చేయ వచ్చు. ఇలాంటి స్ప్రేయర్లు కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి.
సోలార్ క్యాబినెట్ డ్రైయర్లు: టొమాటో, పండుమిరప మొదలగు పంట ఉత్పత్తుల్ని ఎంగ బెట్టేందుకు హైదరాబాదులోని సొసైటీ ఫర్ ఎన ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (సీడ్) వార పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సోలార క్యాబినెట్ డ్రైయర్లను (SDM-200, SDM-400, SDM-500) అభివృద్ధి చేశారు. వీటితో టొమాటో లను 10 గంటల్లో ఎండబెట్టవచ్చు. నెలకు 3 టన్నుల టొమాటోలు ఎండబెట్టి ముక్కలుగా లేదా పొడి రూపంలో వాడుకోవచ్చు. రైతులు తాము కోసిన పండుమిరపకాయల్ని కళ్ళాల్లో రోజుల తర బడి ఆరబోస్తూ నానా అవస్థలు పడుతుంటారు. వాతావరణం అనుకూలించక, అకాల వర్షాలకులోనై తడిసి, నాణ్యత మారి మార్కెట్లో సరైన ధర రాదు. దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చేరి నాణ్యత దెబ్బతింటుంది. సీడ్ సంస్థ రూపొందించిన ఎస్. డి.ఎం.-200 డ్రైయర్లో 7-8 రోజుల్లోనే ఎండబెట్టు కోవచ్చు. ఇందులో ఎండబెట్టిన కాయలు నాణ్యత కలిగి మంచి ధర లభిస్తుంది. పండ్లు, కూరగా యలు, అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాల వంటి పంట ఉత్పత్తులనూ ఈ డ్రైయర్లలో ఆరబెట్టుకో వచ్చు. గ్రామీణ యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు శిక్షణ పొంది స్వయం ఉపాధిగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
Also Read: Farmer Success Story: జామ సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు.!
Must Watch: