యంత్రపరికరాలు

వ్యవసాయ యంత్రాల వినియోగంలో వృద్ధి..

0
Developments in Agricultural Machinery

Agricultural Machinery

Developments in Agricultural Machinery వ్యవసాయంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధునాతన వ్యవసాయ యంత్రాల వినియోగంతో పంట సాగు తీరు మారుతుంది. కూలీలా కొరతను అధిగమించేందుకు రైతులు నవీన వ్యవసాయ యంత్రాలను ఎంచుకుంటున్నారు. దీంతో ప్రయివేట్ కంపెనీలు పెద్ద ఎత్తున వ్యవసాయ యంత్రాలను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు వృత్తి శిక్షణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా రైతులు పంట నాణ్యత మరియు ఉత్పత్తిని గణనీయంగా మెరుగుపరచడానికి వ్యవసాయ పరికరాలను వినియోగించవలసి వస్తుంది. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా, కొత్త పరికరాల మార్కెట్ విస్తరణ వేగవంతం అవుతుంది.

Ronak Kothari

వ్యవసాయ యంత్రాల వినియోగంపై తాజాగా కొఠారి అగ్రికో సీఈవో రోనక్ కొఠారి Ronak Kothari స్పందించారు. అయన మాట్లాడుతూ… పెరిగిన పారిశ్రామికీకరణ వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి, దీని ఫలితంగా రాబోయే ఐదేళ్లలో గణనీయమైన వృద్ధి జరగనుంది. భారతదేశంలో కూడా వ్యవస్థీకృత వ్యవసాయ వ్యవస్థలకు ఇది ఒక నిదర్శనం. కొఠారి అగ్రికో ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించడంలో మరియు సంపూర్ణంగా ఎదగడంలో మా సంస్థ ద్వారా సహాయ పడుతున్నాము. రైతులకు సాధ్యమైనంత తక్కువ ధరకు ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే మా ద్వేయం.

Agricultural Machinery

Kothari Agrico అదేవిధంగా జిపిఎస్, గూగుల్ ఎర్త్ మరియు రోబోటిక్ సిస్టమ్‌ల వంటి కొత్త సాంకేతికతతో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తున్నాము. ఇక నవీన యంత్రాల వాడకంలో ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. యంత్రాలను కొనుగోలు చేసేందుకు రైతులకు సబ్సీడీ రూపంలో వారికి అండగా ఉంటున్నాయి అని అన్నారు కొఠారి అగ్రికో సీఈవో రోనక్ కొఠారి. Agricultural Machinery

Leave Your Comments

రా రైస్ కొంటామని మీరే కదా చెప్పింది !

Previous article

వరి కొనుగోలుపై 26న మళ్లీ కలుద్దాద్దాం: కేంద్రం

Next article

You may also like