Cylindrical Maize Sheller: తెలంగాణా మరియు ఆంధ్రలో మొక్కజొన్న కోతలకు వచ్చాయి. కోత సమయంలో కూలీల కొరత ఉండడం వలన కోత మరియు గింజ వేరు చేయుటకు ఇబ్బందులు ఉన్నట్టుగా రైతులు వాపోతున్నారు. హర్వెస్టర్లు అందరికీ అందుబాటులో లేకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. షెల్లింగ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఈ ప్రత్యేక సాధనాల గురించిన వివరాలు పొందుపరచాము. తక్కువ ఖర్చు, శ్రమతో రైతులు సునాయాసంగా మార్కెట్ లో సరైన సమయంలో అమ్మి అధిక లాభాలు గానించే అవకాశం ఉంది.
గొట్టపు రకం మొక్కజొన్న షెల్లర్ ఉపయోగం: గొట్టపు మొక్కజొన్న షెల్లర్ పొట్టు తీసిన కంకుల నుండి గింజలను వేరు చేయుటకు ఉపయోగపడుతుంది. ఇది సంప్రదాయ పద్దతి కన్నా చాలా సులభం మరియు ఉత్పాదకమైనది. సంప్రదాయ పద్దతి వలె చేతితో ఒలవడం ఉండదు. మేషీన్ షెల్లర్ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక దగ్గర కూర్చుని గింజలు ఒలవడానికి వీలుగా ఉంటుంది.
Also Read: ఎరువులు బ్రాడ్‌కాస్టర్
మొక్కజొన్న షెల్లర్ యొక్క సంక్షిప్త వివరాలు: తేలికపాటి ఉక్కు పలకతో తయారు చేయబడింది. ఇది అష్టభుజ ఆకారంలో వంచబడి ఉంటుంది.దీనిలో నాలుగు టేపర్డ్ రెక్కలు అమర్చబడి ఉంటాయి, ఇది మొక్కజొన్న గింజలను పొట్టు తీసిన కంకుల నుండి షెల్ చేయడానికి సహాయం చేస్తుంది. ఈ సాధనంలో కంకిని ఉండి గుండ్రంగా తిప్పితే, ట్విస్టింగ్ యాక్షన్ వలన షెల్లింగ్ చేయబడుతుంది. అపుడు గింజలను కందే నుండి వేరు చేయబడుతాయి. దీనిని ఉపయోగించి గంటకు 27 కేజీల గింజను వేరు చేయవచ్చు.
మొక్కజొన్న షెల్లర్ – లాభాలు
సాంప్రదాయ పద్ధతిలో కన్నా కూలీల యొక్క కార్డియాక్ ఖర్చులో దాదాపు 15% వరకు ఆదా అవుతుందని అంచనా. కొడవలితో షెల్లింగ్ చేసిన దానికన్నా ఈ సాధనం వలన కార్మికుల ఉత్పాదకత దాదాపు 1.6 రెట్లు ఎక్కువ. చేతి వేళ్లకు గాయం అయ్యే అవకాశాలు దాదాపు సున్నా, ఈ సాదనంకు అయే ఖర్చు రూ. 60/-. దీనిని CIAE, భోపాల్ పరిశోధన స్థానం వారు అభివృద్ధి చేశారు.దీని లభ్యత కోసం CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038. వారిని సంప్రదించవచ్చు.
Also Read: నాలుగు- వరుస వరి డ్రమ్ సీడర్