యంత్రపరికరాలు

Water Saving Tools: పొలంలో సాగు నీటిని ఆదాచేసే పనిముట్లు.!

2
Water Saving Tools
Water Saving Tools

Water Saving Tools – ఎ. బేసిన బిస్టరు : ఈ పరికరాన్ని మెట్ట సేద్యంలో ఎక్కడ పడిన వర్షపునీటిని అక్కడనే వాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరం. ఇది పొలంలో నాటిన సాళ్ళను మినహా పొలమంతా కాలువలు మరియు గట్లు చేయడానికి సమర్ధవంతంగా వాడవచ్చును. ఈ పరికరంలో అమర్చబడిన మీట పొలంలో మట్టిని త్రావ్వే కర్రును కిందకు పైకి మరల్చడం వలన మట్టిని కొద్ది కొద్దిగా తీసి చిన్న చిన్న గుంతలుగా చేస్తుంది. ఇలా చేసిన కాలువకు అడ్డుకట్ట కూడా వేస్తుంది. మెట్ట భూములలో పంట వరుసలను మినహాయించుకొని పొలమంతా చేయడం వలన గుంతలలో పడే అకాల వర్షపు నీరు నిల్వ ఉంది. ఆ నీరు ప్రక్కనే ఉన్న మొక్కలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది.

Also Read: Seed Storage: విత్తన నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగులు – యాజమాన్యం

బి. ప్లాస్టిక్‌ మల్చ్‌ వేసే యంత్రము :
కొత్త వ్యవసాయ విధానాలలో తేమ ఆదాచేసే ప్లాస్టిక్‌ మల్చింగ్‌ ఒకటి ముఖ్యంగా రైస్ట్‌ బెడ్‌ (ఎత్తయిన మట్టి బోదెల) పైన పండిరచే పంటలు మరియు కూరగాయలు పళ్ళ తోటల నుండి పంటలను నాటేటప్పుడు మట్టి బోదెలను వేస్తూ దానితో పాటు డ్రిప్‌ పైపును వాడి పండిరచడం పరిపాటి. ఈ విధంగా మట్టి బోదెలను వేసే ఆపై డ్రిప్‌ పైపును మరియు ప్లాస్టిక్‌ షీటు పరిచి, షీట్‌ ప్రక్కన మట్టితో కప్పడం వంటి అన్ని పనులను ఒకే సారి చేయడం కోసం రూపొందించిన పరికరమే ఈ ప్లాస్టిక్‌ మల్చ్‌ పరికరం. ఈ ప్రక్రియ ద్వారా పంటకు లేదా మొక్కకు ఇచ్చిన తేమ ఆవిరి కాకుండా పంట మొదళ్ళలోనే ఉండి ఉపయోగపడుతుంది. అంతేకాక కలుపు మొక్కలు వచ్చేందుకు వీలు లేకుండా చేస్తుంది. ఇలా ఉపయోపడడం వలన కలుపుతీసేందుకు అయ్యే ఖర్చును తగ్గించి నీటి ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో అమర్చబడిన చక్రం ద్వారా కావల్సిన దూరంలో గుంతలు చేసి వాటిలో పంట లేదా విత్తనం నాటేందుకు దీని ఖరీదు రూ.7,000/- ఉండి మామూలు 35 హెచ్పి ట్రాక్టరుతో లాగేందుకు వీలుగా రూపొందించబడిరది. ఈ పరికరం ద్వారా 1 మీటరు లేదా 1.5 మీటర్లు లేదా 2 మీ. వెడల్పుగల మల్చింగ్‌ షీటును వేయవచ్చును.

Also Read: Paddy Harvesting Machines: పంట కోసే యంత్రాలు.!

Water Saving Tools

Water Saving Tools

సి. స్ప్రేయర్స్‌ :- (మందులు పిచికారీ చేయు పరికరము):
స్ప్ప్రేయర్‌ అను ఈ పరికరము కలుపు నివారణ మందులను, ఎరువులను మరియు పురుగు మందులను సమాంతరంగా పిచికారీ చేయుటకు ఉపయోగిస్తారు. (స్ప్రేయర్స్‌ ఉపయోగించే శక్తి ప్రకారం పలు విధములుగా విభజించబడినవి. న్యాప్‌ స్యాక్‌ స్పేయర్స్‌, పవర్‌ స్ప్రేయర్స్‌, ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ప్రేయర్స్‌ మొదలైనవి. న్యాప్‌ స్యాక్‌ స్పేయర్‌ వీపున తగిలించుకుని ఎడమ చేతితో లీవర్ను పైకి కిందకి కదిలించడం వలన ట్యాంక్లో పీడనం ఏర్పడి పిచికారీ చేయవలసిన ద్రవం నాజిల్‌ ద్వారా సూక్ష్మ రేణువులుగా తుంపర్లుగా మారబడతాయి.

రేణువులు పరిమాణం పీడనం మరియు నాజిల్‌ మీద ఆధారపడి ఉంటుంది. న్యాప్‌ ప్యాక్‌ (స్ప్రేయర్‌ పొలంలో పంట నాశనం చేయు పురుగులను సమర్ధవంతంగా ఎదురుకోవడానికి ఉపయోగపడుతుంది. న్యాప్‌ స్యాక్‌ స్పేయర్‌ ధర రూ? 500-2500/-లో మార్కెట్లో దొరుకుచున్నది. పవర్‌ స్ప్రేయర్‌ వీపున తగిలించుకుని ఎడమ చేతి సహాయంతో మందు కావలసిన ప్రదేశంలో వేయవచ్చును. పవర్‌ స్ప్రేయర్‌ పెట్రోల్‌ లేదా కిరోసిన్‌ ఇంజన్తో నడపబడుతుంది. ఈ పరికరము మార్కెట్లో రూ? 5000-12,000/- – ధరలో లభ్యమవుతుంది. ట్రాక్టర్‌ మౌంటెడ్‌ బూమ్‌ స్ప్రేయర్‌ ట్రాక్టర్‌ సహాయంతో నడుచును. ఈ పరికరము ట్రాక్టర్‌ వెనుక భాగంలో కావలసిన సమయంలో అమర్చుకోవచ్చును. ఈ పరికరము ట్రాక్టర్‌ పిటిఒ సహాయంతో ద్రవాన్ని పిచికారీ చేస్తుంది. దీని ధర ట్రాక్టర్‌ అశ్వ శ్రేణి మరియు ట్యాంక్‌ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది.

Also Read: Phytohormones Importance: మొక్కలలో ఫైటోహార్మోన్ల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Paddy Harvesting Machines: పంట కోసే యంత్రాలు.!

Previous article

Best Agriculture Tools: అంతర కృషికి వాడే పనిముట్లు.!

Next article

You may also like