CIAE Seed Drill: ఈ గొర్రు గోధుమ, సోయాబీన్, మొక్కజొన్న, పెసర, కంది వంటి పంట విత్తనాలను వరసలలో నాటుటకు ఉపయోగపడుతుంది. ప్రతి సారి కిందకు వంగి విత్తనాలను సరైన దూరంలో నాటడం శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని పని చేపించేది. దీనిని వాడడం వలన అట్టి శ్రమను దూరం పెట్టవచ్చు.
CIAE సీడ్ డ్రిల్ (విత్తనపు గొర్రు)సంక్షిప్త వివరణ: CIAE సీడ్ డ్రిల్ ను CIAE, భోపాల్ వారు మహిళల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇది ఒక హ్యాండిల్, విత్తన తొట్టి,ఎరువుల తొట్టి, పెగ్ రకం గ్రౌండ్ వీల్, చిన్న డబ్బులతో కూడిన రోలర్ మరియు డ్రిల్ ను లాగడానికి ఒక కొక్కెంను కలిగి ఉంటుంది. మీటరింగ్ రోలర్ గ్రౌండ్ వీల్ షాఫ్ట్‌కు అమర్చబడి ఉంటుంది.
Also Read: పంజాబ్ వ్యవసాయ వర్సిటీ సీడ్ డ్రిల్
విత్తన డ్రిల్‌ను ఉపయోగించే ముందు పొలంను బాగా సిద్దం చేసుకోవాలి. సీడ్ డ్రిల్‌ను ఇద్దరు కూలీలు నడపవచ్చు, ఒకరు లాగడానికి ఉంటే మరొకరు నెట్టడానికి, దారి చూపడానికి ఉండాలి. లాగడం కోసం సీడ్ డ్రిల్ ముందు భాగంలో అమర్చిన కొక్కెంకు తాడు కట్టి లాగాలి. ఇది గంటకు 430 m2 స్థలంలో విత్తగలదు.
CIAE సీడ్ డ్రిల్ (విత్తనపు గొర్రు) ప్రయోజనాలు : సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే 18 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలది.కూలీల కార్డియాక్ ఖర్చులో దాదాపు 87% ఆదా అవతుంది.వంగే శ్రమ లేకుండా విట్టుకోడం సులభం చేస్తుంది. కలుపు తీత యంత్రాలు సమన్వయ పరచడం ద్వారా కలుపు తీయుట సమయంలో ఖర్చు మరియు శ్రమ తగ్గుతుంది. విత్తన పొదుపు చేయవచ్చు. దీని ఖర్చు: రూ. 5000/-
CIAE సీడ్ డ్రిల్ (విత్తనపు గొర్రు) డెవలప్ చేసినవారు: CIAE, భోపాల్. ప్రస్తుతం లభ్యం అయే స్థలం: CIAE, నబీ బాగ్, బెరాసియా రోడ్, భోపాల్- 462 038
Also Read: కౌజు పిట్టల పెంపకం మంచి లాభసాటిగా మారింది