యంత్రపరికరాలు

Paddy Bund Maker: ఈ పరికరం వాడితే రైతులకి 50 వేల రూపాయలపెట్టుబడి తగ్గుతుంది..

2
Paddy Bund Maker
Paddy Bund Maker Machine

Paddy Bund Maker: రైతులు వరి నారు పొలంలో నాటే ముందు పొలం దున్నుకుంటారు. పొలం దున్నుకున్న కూడా పొలం గట్టుల చుట్టూ ఉన్న గడ్డిని మళ్ళీ ప్రత్యేకంగా కూలీలతో చెక్కించాలి. చెక్కిన గట్లని మళ్ళీ మట్టితో కప్పాలి. ఈ పని మొత్తం చేయడానికి ఒక కూలీకి దాదాపు 2500 రూపాయల ఖర్చు అవుతుంది. రైతులకి ఈ ఖర్చు తగ్గించడానికి నల్గొండ జిల్లా, కాకన్నగూడు గ్రామంలో రైతు షేక్ బాషా గారు గాట్లు చెక్కే పరికరాని తయారు చేశారు.

ఈ గట్లు చెక్కే పరికరం కల్టివేటర్ పరికరానికి ఒక అధానమైన వస్తువును చేర్చాడు. పల్-టర్ పరికరం డిస్క్ కల్టివేటర్ పరికరానికి అంచులో వేసుకున్నాడు. రోటవేటర్ క్లమ్ప్ ద్వారా ఈ డిస్క్ని కల్టివేటర్కి అదనంగా వేసుకున్నాడు. డిస్క్, క్లమ్ప్ 3500 రూపాయల ఖర్చు అవుతుంది. ఎక్సటెన్షన్ కోసం ఇంకో 500 రూపాయలు ఖర్చు అవుతుంది.

Also Read: Distribution Paddy Farming: రైతులు వరి విత్తనాలు ఇలా నాటుకోవడం ద్వారా కూలీల ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది..

Paddy Bund Maker

Paddy Bund Maker

ఈ పరికరాని రెండు వైపులు వేసుకోవడానికి 8 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. షేక్ బాషా గారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ గట్లు చెక్కే పరికరాన్ని వాడుతున్నారు. ఒక ఋతువులో దాదాపు 22 ఎకరాలు గట్లు చెక్కుతున్నారు. ఒక ఎకరం గట్లు చెక్కదానికి ఒక కూలీకి 2500 రూపాయల ఖర్చు అవుతుంది. ఇలా ఈ పరికరం తయారు చేసుకుంటే రైతులకి దాదాపు 50 వేల రూపాయలు పెట్టుబడి తగ్గుతుంది .

ఈ పరికరం కేవలం కల్టివేటర్ అదనంగా వేసుకుంటాం కాబట్టి వాడటం కూడా చాలా సులువు. మెట్ట పద్దతిలో వరి సాగు చేసే వాళ్ళకి ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. ఈ పరికరం గురించి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే 9948943202 నెంబర్ సంప్రదించండి.

Also Read: Backyard Curry Leaves Farming: ఇంటి పెరట్లో కరివేపాకును పెంచుతున్న రైతులు.!

Leave Your Comments

Distribution Paddy Farming: రైతులు వరి విత్తనాలు ఇలా నాటుకోవడం ద్వారా కూలీల ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుంది..

Previous article

Sugarcane Farmers: చెరకు రైతుల బకాయిలు చెల్లించాం – కేంద్ర మంత్రి

Next article

You may also like