Best Agriculture Tools: పంట ఏదైనా అంతర కృషి చాలా ముఖ్యమైన ప్రక్రియ ఇలా అంతర కృషి చేయడం వల్ల పంటపొలంలో కలుపు నివారించడమే కాక మొక్కవేళ్ళ దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్ళు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి ప్రాకి భూమిలోపల పొరల లోని నీటిని సమర్థవంతంగా పొందుతుంది. వీటియంత్రాలలో ముఖ్యమయినవి.
(ఎ) లాంగ్ హ్యాండల్ వీడరు : స్టార్ వీడరు, సింగిల్ బ్లేదు వీడరు, కోనోవీడరు, రోటరీ వీడరు మొదలైనవి. ఈ పరికరాలను నిలుచున్న భంగిమలో ఉండి సాళ్ళమధ్య కలుపును తీయడమే కాక మొక్కల వేళ్ళవద్ద నేలగుల్ల బారే విధంగా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది. దీనితో ఎన్నోరకాల కర్రులను రూపొందించి వాడుకోవచ్చును. ఈ స్టార్ వీడరు రెండు పళ్ళచక్రాలను చట్రంలో అమర్చి దీనికి పొడగాటి చేతి పిడిని, నిలబడి ఉపయోగించే వీలుగా రూపొందించి ఉంటారు. ఇలా నిలుచున్న బంగిమలో పని చేయడం వలన, పనికి కావలసిన శ్రమ అతి తక్కువ అవసరం ఉంటుంది. ఒక మనిషి దీని సహాయంతో రోజుకు 0.25-0.4 ఎకరాలు అంతర కృషి సమర్థవంతంగా చేయవచ్చును. అంతేకాక వంగుకొని తొలికతో చేసే శ్రమను పోలిస్తే సుమారు 50 శాతం తక్కువ శ్రమతో పూర్తిచేయవచ్చును.
(బి) ఎడ్లతో నడిపే అంతర కృషికి ఉపయోగపడే యంత్రాలు :
1. గుంటూరు ఒంగోలు నాగలి: ఇది ఎడ్ల సహాయంతో పనిచేసే అంతర కృషికి గాను రూపొందించిన పరికరము. దీనిలో మూడు కర్రులు ఒక చట్రానికి బిగించి ఈ చట్రము రెండు చక్రాల పై అమర్చి, ఎద్దులు సులువుగా లాగేందుకు వీలుగా నిర్మించారు. ఈ కర్రుల అడుగు భాగంలో బాతు కాలిని పోలి మట్టిని కదిపి కలుపు మొక్కలు పెకలించే విధంగా ఉంటుంది ఈ కర్రుల మద్య దూరం పంట సాళ్ళ మధ్య దూరాన్ని బట్టి మార్చుకొనేందుకు వీలుగా రూపొందించారు. ఈ కర్రుల మధ్య చట్రం చక్రాలపై ఆధారపడి నడువడం వలన్న ఎద్దులకు శ్రమ చాలా తక్కువ. ఈ పరికరంతో సుమారు గంటకు 0.36 నుండి 0.4 ఎకరములు అంతర సేద్యం చేయవచ్చును.
2. 3 లేదా 5 కర్రుల నాగలి :
ఈ నాగలి ప్రత్యేకంగా ఎడ్లతో లాగేందుకు రూపొందించబడినవి ఈ నాగలిలో 3 లేదా 5 కర్రులు ఒక చట్రానికి బిగించి వాటి మధ్య దూరం సాళ్ళ మధ్య దూరాన్ని అనుసరించి మార్చి అంతర కృషిచేయడానికి వీలుగా రూపొందించి ఉంటుంది. అందువలన ఏ పంటకైనా అంతరకృషి చేసేందుకు సమర్థవంతంగా వాడగలం. దీనిలో చక్రాలు రూపొందించనందువలన గంటకు 0.25 నుండి 0.3 ఎకరములు మాత్రమే సేద్యం చేయగలదు.
Also Read: Water Saving Tools: పొలంలో సాగు నీటిని ఆదాచేసే పనిముట్లు.!
(సి) సిలపె విదరు : దీనిలో 3 నుంచి 5 హెచ్.పి. డీజిల్ ఇంజనును చట్రంపై బిగించి ఆ శక్తిని బెల్టు ‘‘వెనుక రూపొందించబడిన రోటరీ వీడరును మరియు వీడరు ముందుకు నడిపేందుకు చక్రాలను అమర్చిం ద్వారా న త్రిప్పే విధంగా అమర్చబడి ఉంటుంది. కాకపోతే దీని వేగము చాలా తక్కువ. దీనిలో కర్రులను పంట సాళ్ల మధ్య దూరాన్ని బట్టి మార్చుకొని అన్ని రకాల పంట సాళ్ళలో అంతరకృషికి వీలుగా మార్చుకొనేందుకు వీలైతుంది. దీనిని చిన్న రైతులు తక్కువ శ్రమతో తమంతట తాము సేద్యం (వ్యవసాయం చేసేందుకు వీలుగా బి రూపొందించబడినది.
దీని ద్వారా గంటకు 0.15 నుండి 0.25 ఎకరములు అంతరకృషి చేయవచ్చును. ఇదికాక 5-6.5 హెచ్.పి. ఇంజను సహాయంతో నేరుగా కర్రులను నడుపబడే యంత్రము. దీని వేగము ఎక్కువ మరియు 1. గంటకు 1 ఎకరము వరకు అంతరకృషి చేయవచ్చును. వీటి ఖరీదు రూ.52,000/- నుండి రూ.56,000/- ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన చక్రములు లేనందున యంత్రాన్ని నియంత్రించడం కష్టం అందువలన యంత్రం ముందుకు పోవడానికి నిర్దేశించిన చక్రాలు వున్న యంత్రము సులువుగా ఉపయోగించవచ్చు.
(డి). ట్రాక్టరు సహాయంతో సాళ్ళలో అంతర సేద్యం చేసే యంత్రం :
అంతరకృషి చేయడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికి మెట్ట భూమిలో తప్పనిసరి, ఎందుకంటే అంతరకృషి ద్వారా కలుపు మొక్కలను తొలగించడమేకాక, సాళ్ళ మధ్యలో భూమిని గుల్ల బార్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా పడ్డ వర్షం లేదా సాగు నీరు బాగా ఇంకి మొక్క వేర్లకు అందించడం జరుగుతుంది. అంతేకాక అందించిన పోషకాలను మొక్క వేర్ల వరకు చేరి వృదా కాకుండా ఉపయోగపడుతుంది.
ఈ అంతర సేద్యం మెట్ట సేద్యంలో అయితే వర్షాలు లేనప్పుడు పంట బెట్టకు గురైనపుడు భూమిలోపలి తేమ సన్నటి గొట్టాల ద్వారా ఆవిరై వంట మరికాస్త నీటి యద్దడికి గురైయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతరకృషి ద్వారా ఆ నాళాలను పూడ్చి తద్వారా భూమిలోపలి తేమను నిలుపు కొనేందుకు వీలవుతుంది. ఈ పరికరం ట్రాక్టరు పి.టి.ఓ. సహాయంతో రెండు లేదా మూడు సాళ్ళను ఒకేమారు చేసేందుకు వీలవుతుంది. దీని ఖరీదు రూ. 70,000/- అవుతుంది. దీని ద్వారా రోజుకు 6 ఎకరములు వరకు అంతరకృషి చేయవచ్చు. కాకపోతే ఈయంత్రం వాడేందుకు పంటను సాళ్ళ పద్దతిలో మాత్రమే నాటి ఉండాలి మరియు సాళ్ళమధ్య 20 సెం.మీ గాని అంతకంటే ఎక్కువగా ఉండాలి.
Also Read: Phytohormones Importance: మొక్కలలో ఫైటోహార్మోన్ల ప్రాముఖ్యత.!