Double Wheel Marker: రైతులు పంట పండించాలి అంటే దుక్కి దున్నాలి, విత్తనాలు నాటాలి. దుక్కి దున్ని విత్తనాలు నాటే పరికరాలు ఉన్నాయి కానీ ఈ పరికరాలు మహిళలు ఉపయోగించడానికి అనుకూలంగా లేవు. పరికరాలు ఉపయోగించడానికి ఖర్చు ఎక్కువ అన్ని మహిళలు విత్తనాలు వల్లే పొలంలో వేయడానికి వెళ్తారు. ఒక పంట పూర్తి అయ్యాక మరో పంట వేయడానికి కనీసం ఒక నెల సమయం పడుతుంది. మరో పంట వేయడానికి నేలను దున్నాలి. దీనితో రైతులకి సమయం, దుక్కి దున్నే ఖర్చు వృధా అవుతుంది. రైతుల సమయం. దుక్కి దున్నే ఖర్చు వృధా కాకుండ, మహిళ రైతులకి సులువుగా ఉపయోగించడానికి జీరో టిల్లేజి డబల్ వీల్ మార్కర్ పరికరం వచ్చింది.
Also Read: Kubota A211N Tractor: వ్యవసాయంలో బుల్లి ట్రాక్టర్ చేసే వింతలు.!
వరి పంట కోసిన తర్వాత తక్కువ ఖర్చు, సమాయంతో మొక్కజొన్న, వేరుశనగ విత్తనాలని ఈ జీరో టిల్లేజి డబల్ వీల్ మార్కర్ సహాయంతో నాటుకోవచ్చు. వరుసల మధ్య దూరం తగ్గించుకోవడానికి , పెంచుకోవడానికి వీలుగా ఉంది. ఈ పరికరం వుపయోగించే సమయంలో పొలం దున్నకోవాల్సిన అవసరం లేదు. వరి పంట కోసిన తర్వాత వరి కోయనాలని దున్నకుండా డబల్ వీల్ మార్కర్ ఉపయోగించి మొక్కజొన్న, వేరుశనగ విత్తనాలు పొలం శాలలో నడుస్తూ విత్తనాలను విత్తుకోవాలి. ఈ డబల్ వీల్ మార్కర్ ఉపయోగించడం వల్ల దుక్కి దున్నే ఖర్చు, నెల రోజుల కాలం తగ్గుతుంది.
ఈ డబల్ వీల్ మార్కర్ విత్తనాలను సమాన దూరంలో నాటుతుంది. సమాన దూరంలో నాటడం వల్ల గాలి, వెలుతురు పంటకి బాగా వస్తుంది. పంటకు పురుగులు, తెగుళ్లు, తగ్గుతాయి. జీరో టిల్లేజ్ పద్దతిని వడటం వల్ల పంట బాగా పండుతది. మొక్కజొన్నవిత్తనాల మొక్కల మధ్య 20 సెo. మీ. దూరం, 60 సెo. మీ. వరుసల మధ్య దూరంలో డబల్ వీల్ మార్కర్ రంద్రాల నుంచి విత్తనాలు నేరుగా పొలంలోకి విత్తుకోవచ్చు. ఈ బల్ వీల్ మార్కర్ మార్పులు చేసుకొని వేరుశనగా పంటకి 20సెo. మీ. మొక్కల మధ్య దూరం, 40సెo. మీ వరుసల మధ్య దూరంలో వాడుకోవచ్చు. ఈ జీరో టిల్లేజి డబల్ వీల్ మార్కర్ వాడటం వల్ల కూలీలా ఖర్చు, శ్రమ, దుక్కి దున్నకుండా వేరుశనగ, మొక్కజొన్న పంట విత్తనాలు విత్తుకోవచ్చు. ఈ పరికరం మహిళ రైతులు సులువుగా ఉపాయగించే విధంగా ఉంది.
Also Read: Micro Greens: ఇంటిలో పండించుకునే పంటలతో లక్షలు సంపాదించడం ఎలా ?