Agricultural Machineries: వరి పంట నిలబెట్టిన వరుసల నడుమ చిత్తడి నేలల్లో కలుపును వేరుచేయడానికి మరియు పూడ్చివేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. పొడవాటి హ్యాండిల్ దిగువన బాగాన రెండు కత్తిరించబడిన రోలర్లను ఒకదాని వెనుక మరొకటి పెట్టబడి ఉంటాయి.కోనికల్ ఆకారంలో ఉన్న రోలర్‌ల చివరణా బ్లేడ్లను కలిగి ఉంటుంది.ఈ యూనిట్ మట్టిలో మునిగిపోకుండా ముందు భాగంలో ఉన్న ఒక ఫ్లోట్ నిరోధిస్తుంది.కోనో వీడర్‌ను కేవలం కలుపు తీయడానికే కాకుండా పచ్చిరొట్ట ఎరువు పంటను నేలలో నొక్కడానికి కూడా వాడవచ్చు.
ఇది పై నేలను కదిలిస్తుంది మరియు గాలి పరిమాణాన్ని కూడా పెంచుతుంది. కలుపు మొక్కలను సాంప్రదాయిక పద్ధతిలో చేతులతో వేరుచేసే అప్పుడు వంగే అవసరం ఉండదు ఎందుకనగా ఈ పరికరాలు నిలబడి ఉన్న భంగిమలోనే ఉపయేగిస్తారు. వంగడం భంగిమ అవసరంలేనందు వలన చిత్తడి నేలల్లో కలుపును తీయడంలో కార్మికుల శ్రమ తగ్గుతుంది.దీని సామర్థ్యం సుమారు ఒక గంటకి 120 m² కలిగి ఉంటుంది.
Also Read: విత్తన శుద్ధి కోసం విప్లవాత్మక సీడ్ ట్రీట్మెంట్ డ్రమ్
పండ్ల కోత పరికరం:
పండ్ల తోటల నుండి పండ్లను కోయడానికి దీనిని ఉపయోగిస్తారు.మాన్యువల్‌గా పనిచేసే ఫ్రూట్ హార్వెస్టర్‌లో ప్రధాన భాగంగా PVC సిలిండర్ ఆకారంలో ఉంటుంది. దీని యొక్క పైభాగంలో మూసి ఉంటుంది మరియు V- ఆకారంలో స్థిరంగా రెండు వేళ్లు కత్తిరించి ఉంటాయి మరియు పదునైన బ్లేడు కూడా ఉంటాయి.పండిన పండ్లను కోయడానికి శరీరంపై ఓపెనింగ్ ఉంటుంది.శరీరం యొక్క దిగువ చివర తెరవబడి ఉంటుంది. పండ్లను సేకరించడానికి దానికి నైలాన్ నెట్‌ను కట్టి ఉంటుంది.

శరీరం యొక్క వెనుక భాగం పై అవసరమైన పొడవు యొక్క అల్యూమినియం పైపును పెట్టడానికి ఒక మెటల్ హోల్డర్ కూడా స్థిరంగా ఉంటుంది.కార్మికునికి సౌకర్యాన్ని పెంచడానికి కట్టింగ్ బ్లేడ్ యొక్క పొడవును 30 mm నుండి 70 mm వరకు పెంచారు. దీని సామర్థ్యం ఒక గంటకు 420 పండ్లు.కార్మికుడు చెట్టుపైకి ఎక్కాల్సిన అవసరం లేనందు వలన ఈ ఆపరేషన్ సురక్షితంగా చేయబడుతుంది మరియు పండ్లకి గాయం అయ్యే అవకాశాలు తగ్గించవచ్చు.
Also Read: సేంద్రియ వ్యవసాయ చేస్తున్న అతుల్ రమేష్ సలహాలు