Advances in Tractor Use: ట్రాక్టర్లను వ్యవసాయానికి, రవాణా కోసం ఉపయోగిస్తారు. దీని వాడుకలో తాగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే వీలుంటుంది సాధారణంగా ట్రాక్టర్ తయారీలో దాని స్థిరత్వం కోసం మొత్తం బరువులో 30-35% ముందు ఇరుసున,65-75% వెనుక ఇరుసున ఉంచుతారు. వివిధ కారణాల వల్ల పొలంలో పని చేస్తున్నప్పుడు ట్రాక్టరు స్థిరత్వం కోల్పోయి పక్కకు బరగడం లేదా వెనుకకు తిరగబడి ప్రమాదాలు జరుగుతాయి.
ట్రాక్టర్ వెనుకకు తిరగబడటం:-
ట్రాక్టరుకు పని ముట్టు తగిలించే ఎత్తు ఎక్కువగా ఉంటే పొలంలో దున్నేటప్పుడు లాగుడు బలం ఎక్కువై ముందు ఇరుసు నందు బరువు తగ్గి ట్రాక్టర్ వెనుక పడిపోతుంది. పని ముట్టు తగిలించి ఎత్తు తక్కువుండేలా చూసుకోవాలి. ఈ రక్షక నిర్మాణాలు మొదట భూమిని తాకి డ్రైవర్ కాపాడకల్గుతాయి.
టైర్ల ఎంపికలో:-
టైర్ల వెడల్పు, వ్యాసం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇవి నెలతో ఎక్కువ అనుసంధానం జరిగి ఎక్కువ బరువు లాగుతాయి.వెనుక టైర్లలో 0.8-1.3 ముందు టైర్లలో 1.5 – 2.5 గాలి పిడనం ఉండాలి. ట్రాక్టర్ బరువును దృష్టిలో ఉంచుకొని సరైన టైర్లు ఎన్నుకోవాలి. అప్పుడే మొత్తం పవర్ వెనుక చక్రాలకు వెళ్ళుతుంది. ముందు చక్రాలు దిశ నిర్థిశంను మాత్రమే ఉపయోగపడతాయి. గనుక సులువుగా తిరిగేందుకు ఎక్కువ గాలి పిడనం ఉండాలి.
Also Read: The Role of Fruit and Health Protection: ఆరోగ్య పరిరక్షణలో పండ్ల సాగు పాత్ర.!
సమస్యలు గుర్తించే విధానం:-
ట్రాక్టర్ స్టార్ట్ కాకపోతే:- విద్యుత్ సరఫరా వ్యవస్థలో భాగాలైన బ్యాటరీ, అల్ టర్ నేటర్, స్టార్టీంగ్ మోటార్, స్విచ్ ల లోపం , డిజిల్ సరఫరా వ్యవస్థలోని లోపాలు కారణం కావచ్చు.
ఎక్కువగా నల్లని పొగవస్తుంటే:- ఇంజన్ పై ఎక్కువ భారం ఎయిర్ క్లీనర్ మూసుకుపోవడం, డిజిల్ ఎక్కువగా సరఫరా కావడం కారణాలు కావచ్చు.
ఎక్కువగా నీలం రంగు పొగ వస్తుంటే:- రింగులు ఆరిపోవడం, ఇంజన్ అయిల్ సరైనది కాకపోవడం, మట్టానికి మించి అయిల్ పోయడం కారణాలు కావచ్చు.
లోడు తీసుకోకపోతే:- వాల్వులలోపం, హెడ్ గ్యాస్కెట్ పాడైపోవడం, రింగులు అరిగిపోవడం, డిజిల్ ఫిల్టరు సరిగా పని చేయకపోవడం. ఎయిర్ క్లీనర్ లేదా ఎగ్జస్టు పైపులు మూసుకుపోవడం వంటి కారణాలు వల్ల జరగవచ్చు.
ఇంజన్ త్వరగావేడెక్కడం:- కూలింగ్ వ్యవస్థలోని విభాగాలు రేడియేటరు, వాటర్ పంపు , ప్యాన్ బెల్ట్, ఇంజనాయిల్ సరఫరా చేసే అయిల్ పంపు , ఫిల్టర్ సరిగా లేకపోవడం అలాగే వాడుతున్న అయిల్ సరైనది కాకపోవడం వల్ల కావచ్చు.
బ్యాటరీ మన్నికకోసం:- దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రంచేయాలి. అప్పుడప్పుడు బ్యాటరీ మూతలు తీసి ద్రావకం ప్లేట్లపై 6-12 మి.లి. ఉండేలా చూడాలి తగ్గితే డిస్టిల్ వాటర్ పోయాలి. బ్యాటరీ క్లాంపులు గట్టిగా లేదా వదులుగా బిగించి వాటిపై పెట్రోలియం జెల్లి పూయాలి.
ట్రాక్టర్ ను ఎక్కువకాలం:- పనిచేయకుండా ఉంచాల్సివస్తే అయిల్ ను, బ్యాటరీని తీసివేయాలి. ఇరుసుల కింద చెక్కలు ఉంచి ట్రాక్టర్ బరువు టైర్ల పై పకుండా చూడాలి.
Also Read: Different Types Tractors: వివిధ రకముల ట్రాక్టర్లు