యంత్రపరికరాలు

ACE Tractors: ACE ట్రాక్టర్ల సంస్థ నుంచి VEER- 20

0
ace tractors

Ace Tractors: భారతీయ వ్యవసాయ రంగంలో ప్రఖ్యాత ట్రాక్టర్ గా పేరు తెచ్చుకుంది ACE ట్రాక్టర్ల కంపెనీ. తాజాగా ACE ట్రాక్టర్ల కంపెనీ మరో అత్యాధునిక ట్రాక్టర్ ని పరిచయం చేసింది ఆ సంస్థ. రైతుల డిమాండ్ మేరకు ఆ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో ట్రాక్టర్ ని తయారు చేసింది సంస్థ. రైతుల డిమాండ్ కు తగ్గట్టు ఇప్పటికే అనేక సదుపాయాలతో రూపొందించిన పలు ట్రాక్టర్లు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కాగా ఈ కంపెనీ అద్భుతమైన ట్రాక్టర్లతో పాటుగా వ్యవసాయ పరికరాలను కూడా అందిస్తుంది. భారతదేశంలో ACE ట్రాక్టర్ ధర జాబితా ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు నుంచి రూ .15.60 లక్షల వరకు ఉంటుంది. మరియు HP 25 నుండి 90 HP వరకు ఉంటుంది. ACE ట్రాక్టర్ మోడళ్లలో మినీ ట్రాక్టర్లు, 4WD ట్రాక్టర్లు మొదలైనవి ఉన్నాయి. వినూత్నమైన ఫీచర్లతో తయారు చేయబడిన ACE కంపెనీ ట్రాక్టర్ల మోడళ్లలో ACE DI 450 NG 4WD, ACE DI-350NG, ACE DI 550 NG 4WD, ACE DI-550 స్టార్ మొదలైనవి అత్యధికంగా అమ్ముడుపోయినవిగా సంస్థ పేర్కొంది.

ace tractors

ACE Tractors

Also Read: మొక్కజొన్న గింజలు ఒలిచే యంత్ర పరికరాలు

ఇకపోతే యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్, అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్, పిక్ అండ్ మూవ్ క్రేన్‌లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ మరియు రోడ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ తయారీలో సుమారు 3 దశాబ్దాలుగా ACE అగ్రగామిగా ఉంది. తాజాగా పరిచయం చేసిన కాంపాక్ట్ ట్రాక్టర్ VEER- 20 చిన్న పొలాల కోసం వినియోగిస్తారు.

ace tractors

ACE Tractors

రైతులకు కాంపాక్ట్ ట్రాక్టర్ల ఉపయోగాలు:

* రవాణా

* రియల్టీ & నిర్మాణం

* గనుల తవ్వకం

* మౌలిక సదుపాయాలు

* ఆరోగ్యం మరియు పారిశుధ్యం

* ఆర్చర్డ్ మరియు వైన్యార్డ్స్

* పశువులు

* ల్యాండ్ స్కేపింగ్

* పచ్చిక సంరక్షణ

* వ్యవసాయం

వీర్ 20 లక్షణాలు

మన్నిక మరియు సులభమైన సర్వీస్‌బిలిటీ కోసం సమర్థవంతమైన అధిక టార్క్ బలమైన ఇంజిన్

సైడ్ షిఫ్ట్ లివర్స్

క్లియర్ లెన్స్ హెడ్‌ల్యాంప్

మొబైల్ ఛార్జర్ (అదనపు సాకెట్ కొనవలసిన అవసరం లేదు)

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

మరింత విశ్వసనీయత కోసం డిస్క్ బ్రేక్

టిప్పింగ్ ట్రాలీ కోసం అదనపు పోర్ట్

అదనపు సౌలభ్యం కోసం ఫెండర్‌లపై పిసి డో సైడ్ లివర్స్

ఫ్రంట్ యాక్సిల్ సపోర్ట్ నుండి హెవీ డ్యూటీ S.G

తక్కువ సేవ కోసం ఆయిల్ బాత్ ఎయిర్-క్లీనర్

90 డిగ్రీ సర్దుబాటు చేయగల సైలెన్సర్

Addc హైడ్రాలిక్స్

ఫ్యాక్టరీ అమర్చిన బంపర్

పండ్ల తోట మరియు అంతర్-వరుస సాగు కోసం 90-డిగ్రీల సర్దుబాటు సైలెన్సర్

ఎర్గోనామిక్‌గా రూపొందించిన లివర్‌లు, ఫుట్‌బోర్డ్, పెడల్స్‌తో సౌకర్యవంతమైన డ్రైవర్ సీటు

Also Read: పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే మార్గం..డ్రమ్ సీడర్

Leave Your Comments

Bell Pepper Farming: అమెరికా క్యాప్సికం సాగుపై తెలుగమ్మాయి అనుభవాలు

Previous article

Sandalwood: ఎర్రచందనానికి విదేశాల్లో ఎందుకంత గిరాకీ?

Next article

You may also like