Sesame Harvester Machine: నువ్వుల పండించే రైతులు కోతల సమయలో, నూర్పిడి సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతక ముందు సంవత్సరంలో అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ నువ్వుల పంట వేసే వాళ్ళు, కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు నుంచి మూడు పంటలు వేస్తున్నారు. రైతులు పంటని ఎక్కువ పండించడం వల్ల పంటని కోయడానికి, ఆరపెట్టుకొని నూర్పిడి చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఈ నువ్వుల పంటని కోయడానికి రైతులు కొడవలి సహాయంతో కోసే వాళ్ళు. పంటని కోయడానికి చాలా సమయం వృధా అవుతుంది. నువ్వుల పంట పండించే రైతుల కష్టాలని చూసిన కడప జిల్లా ఒక మోటార్ మెకానిక్ ఎం.కే. నారాయణ రెడ్డి నువ్వుల పంట హార్వెస్టర్ మెషిన్ తయారు చేశారు.
ఎం.కే. నారాయణ రెడ్డి గారికి సొంతగా ఒక వర్క్ షాప్ ఉంది. ఇందులో అతని సొంతంగా నువ్వుల హార్వెస్టర్ మెషిన్ తయారు చేశారు. నువ్వుల హార్వెస్టర్ తయారీకి జాన్ డీర్ ట్రాక్టర్ని వాడుకున్నారు. ఈ జాన్ డీర్ ట్రాక్టర్కి ప్యాడి హార్వెస్టర్ కట్టర్ ముందు భాగంలో పెట్టారు. ఈ కట్టర్ పంటని కొస్తుంది. కోసిన పంటని ట్రాలీలోకి వెయ్యడానికి కన్వేయర్ చైన్ పెట్టారు. ఈ కన్వేయర్ చైన్ ద్వారా కోసిన పంట ట్రాలీలోకి పడుతుంది.
ట్రాలీ నిండిపోయాక కుప్పగా ఒక చోట వెయ్యడానికి హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. కుప్పగా వేసిన పంటని మళ్ళీ ఆరపెట్టుకొని, కూలీలతో నిర్పిడి చేసుకోవాలి. ఈ యంత్రం ఒక గంటలో ఆకరంన్నర పంటని కొస్తుంది. ఒక రోజులో 12-15 ఎకరాల వరకు కోతలు చేసుకోవచ్చు.
Also Read: Rythu Bandhu Scheme: రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం – మంత్రి
పంట కోయడానికి 200 కూలీలు చేసే పని మొత్తం ఈ ఒక యంత్రం చేస్తుంది. దీని వల్ల రైతులు పంటలు తొందరగా కోతలు చేసుకొని పొలాన్ని మరొక పంటకి తయారు చేసుకోవచ్చు. ఈ యంత్రం జాన్ డీర్ ద్వారా మాత్రమే తయారు చేసుకుంటే మంచి పని తీరు ఉంటుంది.
ఈ నువ్వుల పంటని కోయడానికి ఒక మనిషికి 3500 రూపాయల ఖర్చు అవుతే, ఒక గంటకి ఈ యంత్రానికి 2500 రూపాయలు అవుతుంది. దీని వాడడం ద్వారా రైతులకి పెట్టుబడి ఖర్చు కొంత వరకు తగ్గుతుంది. ఈ యంత్రాన్ని సరైన విధంగా నడిపితే ఒక సీజన్లో 10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
ఈ యంత్రంకి ఎక్కువ రిపేర్ కూడా రాదు. కానీ ప్రతి 200 గంటల పని చేశాక కన్వేయర్ చైన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ కన్వేయర్ చైన్ ధర 12000-15000 వరకు ఉంటుంది.
ఈ యంత్రం తయారీకి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్కి ఒక 3 లక్షలు, హార్వెస్టింగ్ పరికరాని తయారీకి 6 లక్షల ఖర్చు అవుతుంది. ఈ యంత్రం తయారీ ఖర్చు మొత్తం ఒక సీజన్లోలో సంపాదించుకోవచ్చు. ఈ రైతు ఎవరికైనా నువ్వుల హార్వెస్టర్ కావాలి అనుకునే రైతులకి ఇతనే తయారు చేసి ఇస్తున్నారు. ఈ యంత్రం కావాలి అనుకునే రైతులు లేదా వ్యాపారస్తులు ఎం.కే. నారాయణ రెడ్డి గారి నెంబర్కి 9441077084 సంప్రదించండి.
Also Read: Pulses Price: రోజు రోజుకి పెరుగుతున్న పప్పుల ధరలు.!