Seed Cum Fertilizer Drill: వర్షాకాలం మొదలు అయింది.. రైతులు పత్తి విత్తనాలు విత్తుకొని, మొక్కలకి ఎరువులు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా రైతులు పత్తి మొక్కలకి చేతులతోనే ఎరువులు వేస్తుంటారు. చేతులతో ఎరువులు వేయడం వల్ల శ్రమ, సమయం చాలా వృధా అవుతుంది. ఎరువులు వేయడానికి కూలీలా ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటి అని సమస్యలు చూసిన నల్గొండ జిల్లా, ధర్మపురం గ్రామ రైతులు కల్టివేటర్ ద్వారా ఎరువులని వేసుకోవడానికి కొన్ని మార్పులతో ఒక పరికరాన్న తయారు చేసుకున్నారు.
ఈ పరికరాన్ని తయారు చేసుకోవడానికి కల్టివేటర్ పై భాగంలో ఒక పెద్ద ఇనుప డబ్బా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో దాదాపు 100 కిలోలు ఎరువులు సరిపోతుంది. ఈ డబ్బా అడుగు భాగంలో ఒక లెవెల్ర్ ద్వారా ఎంత మొత్తం మొక్కకి ఎరువులు వేయాలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ డబ్బాలో రెండు సంచుల యూరియా లేదా డిఏపి వేసుకోవచ్చు.
లెవెల్ర్ కింది భాగంలో పైప్స్ ద్వారా ఎరువులు మొక్కకి రూట్స్ దగ్గర పడుతుంది. ఈ పైప్స్ కల్టివేటర్ టైన్స్కి కనెక్ట్ చేసుకొని ఉంటుంది. దీని ద్వారా ఒక్కసారి నాలుగు వరుసల వరకు ఎరువులు వేసుకోవచ్చు. ట్రాక్టర్ ద్వారా ఈ పరికరాని వాడటం వల్ల తక్కువ సమయంలో ఎరువులు పొలానికి వేసుకోవచ్చు.
ఈ పరికరాని తయారు చేసుకోవడానికి 10 వేలు ఖర్చు అవుతుంది. దగ్గరిలో ఉండే వెల్డింగ్ వాళ్ళు కూడా తయారు చేసి ఇస్తారు. ఒక్కసారి ఈ పరికరాని తయారు చేసుకుంటే, ప్రతి పంటలో రైతులకి సమయం , శ్రమ తగ్గుంది. మార్కెట్లో చాలా కంపెనీల సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ పరికరాలు ఉన్న వాటిని కొనుగోలు చేయలేని రైతులు ఇలా తక్కువ ఖర్చుతో మీరే తయారు చేసుకోవచ్చు.
Also Read: SPMRM Scheme: SPMRM స్కీం ద్వారా మహిళా రైతులకి ఒక కొత్త ఉపాధి..