ఆరోగ్యం / జీవన విధానం

Jasmine Essential Oil: మల్లెపూల నుండి సుగంధ తైలం తీయటం

1
Jasmine Essential Oil
Essential jasmine oil

Jasmine Essential Oil: జాస్మినమ్‌ గ్రాండిఫోరం నుండి తీసిన సహజమైన నూనె పూల పరిమళాన్ని కలిగి ఉంటుంది. సహజ పరిమాణం చాలా తక్కువ మోతాదులో (0.25%) ఆవిరి అయ్యే నూనె రూపంలో లభిస్తుంది. మల్లె నుండి తైలాన్ని తీయడానికి సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ పద్ధతిని ఉపయోగిస్తారు.

Jasmine Essential Oil

Essential jasmine oil

పూల కోత:
సుగంధ తైలాన్ని తీయడం కొరకు పూర్తిగా విప్పారిన తాజా పూలు అవసరం.పూర్తిగా విప్పారిన పూలను ఉదయం పూటనే కోయాలి. ఉదయం 11 గంటల తరువాత పూలు కోసి నట్లయితే సుగంధ తైలం దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పూలుకోసే సమయంలో లేదా సరఫరా సమయంలో పూలు కలుషితం అయితే కాంక్రీట్‌ నాణ్యత దెబ్బతింటుంది. పూలు కోసిన వెంటనే చల్లటి వాతావరణంలో ఉంచి రెండు గంటల లోపే నూనెను సేకరించే ప్రక్రియను ప్రారంభించాలి.

Also Read: Jasmine Cultivation: మల్లెపూల సాగులో మెళుకువలు

ప్రక్రియ:

పూలను సాల్వెంట్‌లో శుద్ధి చేయడం:

పూర్తిగా విప్పారిన పూలను సాల్వెంట్‌తో శుద్ధి చేయాలి. ఒక కిలో పూలను రెండు లీటర్ల సాల్వెంట్‌లో మునిగేటట్లు చేసి దీనిని నెమ్మదిగా తిరిగే ఎక్స్‌ట్రాక్షన్‌లో 30 నిమిషాలు ఉంచినట్లయితే పూల నుండి నెమ్మదిగా సాల్వెంట్‌లోకి చేరుతుంది. ఈ విధానంలో సాల్వెంట్‌ నెమ్మదిగా పూలలోనికి చొచ్చుకొని పోయే పువ్వులోని మైనం, ఆల్బుమిన్‌ మరియు రంగు పదార్థాలను కలిగేలా చేస్తుంది. ఆ తరువాత సాల్వెంట్‌ను వేరు చేసినట్లైతే శుద్ధమైన నూనె లభిస్తుంది.

సాల్వెంట్‌ను ఆవిరి చేయడం:
పూల నుండి మొత్తం పరిమళాన్ని తీసిన తరువాత వడకట్టి 75 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆవిరి ప్రక్రియను చేపట్టాలి. ఈ ఉష్ణోగ్రత వద్ద సాల్వెంట్‌ పూర్తిగా ఆవిరైపోయి మల్లె తైలం మరియు మైనపు పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఇలా ఆవిరి అవుతున్న సాల్వెంట్‌ను శీతలీకరించడం ద్వారా మరలా ఉపయోగించుకోవచ్చు. ఇలా వచ్చిన ద్రవపదార్థంలో పరిమళాలు, మైనపు కారకాలు మరియు సాల్వెంట్‌ అవశేషాలు ఉంటాయి.

ఈ ద్రవ పదార్థాన్ని వ్యాక్యూమ్‌ డిస్టిలేషన్‌ ద్వారా శుద్ధి చేసినట్లైతే సాల్వెంట్‌కు సంబంధించిన అవశేషాలు అన్నీ తొలగిపోయి మంచి సువాసనగల సుగంధ తైలం గడ్డకట్టిన మైనపుముద్దగా లభిస్తుంది.

జాస్మినమ్‌ గ్రాండిఫ్లోరమ్‌ ` 0.25 శాతం `0.32 శాతం (ఎకరాకు 5.5`11.7 కిలోలు)
జాస్మినమ్‌ ఆరిక్యులేటమ్‌ ` 0.28 శాతం `0.36 శాతం (ఎకరాకు 5.3`11.3 కిలోలు)
జాస్మినమ్‌ సాంబాక్‌ ` 0.14 శాతం `0.19 శాతం (ఎకరాకు 0.5`6.1 కిలోలు)

డా. ఎ. నిర్మల, డా. ఎమ్‌. వెంకటేశ్వర రెడ్డి, డా. కె. చైతన్య. డా. ఎమ్‌. విజయలక్ష్మి, డా. కె. నిరోషా, డా. జి. జ్యోతి,

ఫోన్‌ : 83309 40330

Also Read: Farmers Success Story: కిలో 82 వేలకు అమ్ముడయ్యె పంటను సాగు చేసిన యువ రైతు అమ్రేష్

Leave Your Comments

Bio Fertiliser to Improve Soil Fertility: నేల యొక్క సారవంతం పెంచడంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత

Previous article

Acorus Calamus: స్వీట్ ఫ్లాగ్ గురించి మీకు తెలుసా ?

Next article

You may also like