TRS MPs Protest In Parliament Winter Session రైతు సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సమర శంఖాన్ని పూరించారు. యాసంగి పంట ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుంది రాష్ట్ర నాయకత్వం. తెలంగాణలోని యాసంగి పంట అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నినదిస్తూ.. ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగ ఢిల్లీ పర్యటన చేపట్టింది. కానీ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రం తమ వైఖరి మార్చుకోలేదు. ముందు నుంచి చెప్తున్న విధంగానే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది. దీంతో ధాన్యం కొనుగోలు అంశాన్ని పార్లమెంట్లో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగం నిన్న ఆదివారం తెరాస ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వ్యవసాయానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని ఎంపీలకు సూచించారు. Paddy Procurement
Parliament Winter Session 2021 Live పార్లమెంట్ సమావేశాల్లో మొదటిరోజే రభస మొదలైంది. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్‌సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. కాగా.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని, ధాన్యం కొనుగోలు, నీటి వాటాలు, విభజన హామీలపై కేంద్రం మెడలు వంచేలా ఢిల్లీలో గళమెత్తాలని, వరి పోరును ఉధృతం చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను టీఆర్ఎస్ ఎంపీలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు KCR